31న మొబైల్ లోక్ అదాలత్ | lok adalat in vijayanagaram | Sakshi
Sakshi News home page

31న మొబైల్ లోక్ అదాలత్

Aug 29 2015 10:56 AM | Updated on Sep 3 2017 8:21 AM

విజయనగరంలో పెండింగ్‌లో ఉన్న కేసుల పరిష్కారం కోసం ఈ నెల 31 న లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు జిల్లా సెషన్స్ కోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎమ్. లక్ష్మీనారాయణ తెలిపారు.

బొబ్బిలి: విజయనగరంలో పెండింగ్‌లో ఉన్న కేసుల పరిష్కారం కోసం ఈ నెల 31 న లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు జిల్లా సెషన్స్ కోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎమ్. లక్ష్మీనారాయణ తెలిపారు. శనివారం జిల్లాలోని బొబ్బిలి మండల కేంద్రంలోని పోలీసు అతిథి గృహంలో మీడియా సమావేశంలో ఆయన పాల్గొన్నారు.

ఈ మొబైల్ లోక్‌అదాలత్ ద్వారా ప్రజల వద్దకే వెళ్లి కేసులను పరిష్కరిస్తామన్నారు. జిల్లాలో 12 మంది న్యాయవాదులను ఎంపిక చేసి ప్రత్యామ్నాయ న్యాయవ్యవస్థను ఏర్పాటు చేస్తామని తెలిపారు. వీరి ద్వారా మధ్యవర్తిత్వం జరిపి కేసులను పరిష్కరిస్తామని చెప్పారు. జిల్లాలో 17వేల కేసులు పెండింగ్‌లో ఉన్నాయని ఆయన తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement