కడప జిల్లాలో సస్పెండైన లింగాల ఎంపీడీఓ మురళీ మోహన్ బుధవారం ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.
కడప: కడప జిల్లాలో ఇటీవల సస్పెండైన లింగాల ఎంపీడీఓ మురళీ మోహన్ బుధవారం ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఆర్డీఓపై ఫిర్యాదు చేసినందుకు మురళీ మోహన్ను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. దాంతో మనస్థాపం చెందిన మురళీ తన చావుకు ఆర్డీఓ, కలెక్టర్, శాసన మండలి డిప్యూటీ చైర్మన్ సతీష్ రెడ్డే కారణమని పలువురికి ఎస్ఎంఎస్లు పంపి ఆత్మహత్యకు పాల్పడినట్టు తెలిసింది.
ప్రస్తుతం మురళీ మోహన్ పరిస్థితి విషమించడంతో ప్రొద్దుటూరు ప్రభుత్వాస్పత్రికి తరలించినట్టు సమాచారం. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.