'లైసెన్స్డ్ రివాల్వర్లను స్వాధీనం చేయండి' | licensing rivolvers have to deposit in police stations, says anurag sharma | Sakshi
Sakshi News home page

'లైసెన్స్డ్ రివాల్వర్లను స్వాధీనం చేయండి'

Mar 11 2014 10:40 AM | Updated on Oct 16 2018 6:33 PM

'లైసెన్స్డ్ రివాల్వర్లను స్వాధీనం చేయండి' - Sakshi

'లైసెన్స్డ్ రివాల్వర్లను స్వాధీనం చేయండి'

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో లెసెన్స్ కలిగిన రివాల్వర్లను ఈ నెల 15వ తేదీ లోపు స్థానిక పోలీసు స్టేషన్‌లోగాని ఆయుధ డీలర్ వద్దగాని డిపాజిట్ చేయాలని అనురాగ్‌శర్మ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు

హైదరాబాద్: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో లెసెన్స్ కలిగిన రివాల్వర్లను ఈ నెల 15వ తేదీ లోపు స్థానిక పోలీసు స్టేషన్‌లోగాని ఆయుధ డీలర్ వద్దగాని డిపాజిట్ చేయాలని అనురాగ్‌శర్మ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. జాతీయ బ్యాంకుల వద్ద సెక్యూరిటీ గార్డులకు ఇందుకు మినహాయింపు ఇచ్చారు.

ఈ మేరకు రంగంలోకి దిగిన ఇన్‌స్పెక్టర్లు సోమవారం రాత్రి వరకు నగరంలోని అన్ని ఠాణాలలో కలిపి 360 మంది రౌడీషీటర్లను బైండోవర్ చేశారు. దీంతో పాటు 250 మంది వద్ద ఉన్న లెసెన్డ్స్ రివాల్వర్లను స్వాధీనం చేసుకున్నారు. ఇలాంటి ఆయుధాలు కలిగిన వారు నగరంలో నాలుగు వేలకుపైగా ఉన్నారని కమిషనర్ తెలిపారు.

ప్రచారం కోసం రాజకీయ పార్టీలు నిర్వహించే సభలు, సమావేశాలకు ఆయా డివిజన్, జోన్ అధికారుల నుంచి అనుమతి తీసుకోవాలన్నారు. అనుమతి లేకుంటే కేసులు నమోదు చేస్తామన్నారు. పార్టీ ఎన్నికల  కార్యాలయం పక్కనే మరో పార్టీ కార్యాలయం ఏర్పాటుకు వంద మీటర్ల దూరం ఉండాలని ఆయన స్పష్టం చేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement