కౌలు కట్టలేక... సెల్ టవర్ ఎక్కాడు.. | Lease farmer warns to climb cell tower not to pay of lease crop amount | Sakshi
Sakshi News home page

కౌలు కట్టలేక... సెల్ టవర్ ఎక్కాడు..

May 14 2015 11:38 PM | Updated on Jun 4 2019 5:04 PM

కేంద్రపాలిత ప్రాంతమైన యానాంకు చెందిన దంగేటి ఏడుకొండలు అనే కౌలు రైతు సెల్ టవర్ ఎక్కి ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించారు.

యానాం టౌన్ :కేంద్రపాలిత ప్రాంతమైన యానాంకు చెందిన దంగేటి ఏడుకొండలు అనే కౌలు రైతు సెల్ టవర్ ఎక్కి ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించారు. ఏడుకొండలు ముగ్గురు రైతుల నుంచి 20 ఎకరాలు కౌలు తీసుకుని సాగు చేస్తున్నాడు. పంటనష్టం రావడంతో కౌలు చెల్లించలేక గురువారం పట్టణంలోని ఓ సెల్ టవర్‌ఎక్కారు.

యానాం ప్రాంతీయ పరిపాలనాధికారి గిడ్డి బలరామ్ వచ్చి ఏడుకొండలుకు ఫోన్ చేసి దిగి రావాలని కోరారు. అరుుతే రైతులు తనను కౌలు అడగబోమని హామీ ఇస్తేనే దిగుతానని, లేకపోతే దూకేస్తానని ఏడుకొండలు బెదిరించారు. చివరికి పరిపాలనాధికారి, అందుబాటులో ఉన్న ఓ రైతు లిఖితపూర్వకంగా హామీ ఇవ్వడంతో పాటు తనపై పోలీసు కేసు పెట్టబోమన్న హామీతో ఏడుకొండలు దిగివచ్చాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement