రాష్ట్రపతి పర్యటన కారణంగా.. పోలీసుల ఓవర్‌యాక్షన్ | leaders arrested in wake of president tour at anantapuram | Sakshi
Sakshi News home page

రాష్ట్రపతి పర్యటన కారణంగా.. పోలీసుల ఓవర్‌యాక్షన్

Dec 23 2013 9:55 AM | Updated on Jun 1 2018 8:31 PM

మాజీ రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి శతజయంతి ఉత్సవాల ముగింపు సందర్భంగా అనంతపురంలో జరుగుతున్న కార్యక్రమంలో పాల్గొనేందుకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ వెళ్తున్న సందర్భంగా, ముందుగా సమైక్యవాదులను అరెస్టు చేస్తున్నారు.

రాష్ట్రపతి పర్యటన కారణంగా.. పోలీసుల ఓవర్‌యాక్షన్ కు దిగారు.  ముందస్తు చర్యగా వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు గోపాల్ రెడ్డి, మధు, మారుతినాయుడులను అరెస్టు చేశారు. ఈ దృశ్యాలను చీత్రీకరిస్తున్న సాక్షి విలేకరిపై ఎస్సై నారాయణ జూలం చేశారు. అంతేకాకుండా అసభ్య పదజాలంతో ఎస్సై దూషణ చేసినట్టు తెలిసింది. అనంతపురంలో జరుగుతున్న కార్యక్రమంలో పాల్గొనేందుకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ వెళ్తున్న సందర్భంగా ఈ ఘటన చోటుచేసుకుంది.
 

సర్కారుకు సమైక్యాంధ్ర భయం పట్టుకుంది. రాష్ట్రాన్ని ఒక్కటిగా ఉంచాలంటూ ఆందోళనలు ఉధృతంగా సాగుతుండంటంతో ప్రతి చిన్న విషయానికీ భయపడుతోంది. మాజీ రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి శతజయంతి ఉత్సవాల ముగింపు సందర్భంగా అనంతపురంలో జరుగుతున్న కార్యక్రమంలో పాల్గొనేందుకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ వెళ్తున్న సందర్భంగా, ముందుగా సమైక్యవాదులను అరెస్టు చేస్తున్నారు.

సమైక్యాంధ్ర జేఏసీ నాయకుడు కొగటం విజయభాస్కర రెడ్డితో పాటు దాదాపు 50 మంది సమైక్యవాదులను ముందుగా అరెస్టు చేశారు. రాష్ట్రపతి పర్యటన సందర్భంగా అనంతపురంలో పటిష్ఠమైన బందోబస్తు ఏర్పాట్లు చేశారు. అడుగడుగునా పోలీసు బలగాలను మోహరించారు. రాష్ట్రపతి పాల్గొనే కార్యక్రమ వేదికను అణువణువునా గాలించారు. ఈ కార్యక్రమంలో అధికారలు  అత్యుత్సాహన్ని ప్రదర్శించారు. పిల్లలకు మాత్రమే నీలం సంజీ వరెడ్డి స్టేడియంలోకి అనుమతిని ఇస్తున్నట్టు తెలుస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement