విజయవాడ కాల్‌మనీ కేసులో టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు, నాయకులకు ప్రత్యక్ష సంబంధాలున్న
పాలకొల్లు అర్బన్ : విజయవాడ కాల్‌మనీ కేసులో టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు, నాయకులకు ప్రత్యక్ష సంబంధాలున్న కారణంగానే అసెంబ్లీలో చర్చించకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు పక్కదారి పట్టించినట్టు వైఎస్సార్ సీపీ ఎస్సీ విభాగం జిల్లా అధ్యక్షుడు చెల్లెం ఆనందప్రకాష్ ఆరోపించారు. అసెంబ్లీలో ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కాల్‌మనీపై చర్చకు తీసుకురావాలని పట్టుబట్టినా ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రతిస్పందించకపోవడం దారుణమన్నారు.
ప్రజల్ని తప్పుదోవ పట్టించడం కోసమే చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ప్రతిపక్ష నేత లేవనెత్తిన అంశాలపై చర్చించకుండా ముఖ్యమంత్రి ప్రజాధనం దుర్వినియోగం చేస్తున్నారని విమర్శించారు. కాల్‌మనీ నిందితుల్ని వెంటనే అరెస్ట్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కాల్‌మనీ దోషులపై వెంటనే అసెంబ్లీలో చర్చించి నిందితుల్ని అరెస్ట్ చేసి కటకటాల వెనక్కి నెట్టాలన్నారు. సాంఘిక సంక్షేమశాఖ మంత్రి రావెల కిషోర్‌బాబు దళితుల పరువు తీస్తున్నారని విమర్శించారు. తన శాఖలో జరిగిన లోపాలను సరిదిద్దలేని స్థితిలో ఆయనున్నారని ఆనందప్రకాష్ ఎద్దేవా చేశారు.