లాయర్ ఫక్రుద్దీన్ అరెస్ట్‌కు నిరసనగా న్యాయవాదులు రోడ్డెక్కారు.
ఎస్పీ కార్యాలయం ఎదుట ఆందోళన
Jan 28 2016 1:49 PM | Updated on Jul 11 2019 8:55 PM
అనంతపురం: లాయర్ ఫక్రుద్దీన్ అరెస్ట్‌కు నిరసనగా న్యాయవాదులు రోడ్డెక్కారు. అకారణంగా అరెస్ట్ చేసిన ఫక్రుద్దీన్‌ను వెంటనే విడుదల చేయాలని న్యాయవాదులు గురువారం నిరసనకు దిగారు. న్యాయవాదులంతా కలిసి ఎస్పీ కార్యాలయం ఎదుట రోడ్డుపై బైఠాయించడంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. అనంత కోర్టులో న్యాయవాదిగా పని చేస్తున్న ఫక్రుద్దీన్ బుధవారం రాత్రి గుంతకల్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ అరెస్ట్ కు నిరిసనగా జిల్లా వ్యాప్తంగా న్యాయవాదులు నిరసనలు తెలుపుతున్నారు.
Advertisement
Advertisement