ఎమ్మెల్యే కమలమ్మ-శివరామకృష్ణ వర్గీయుల మధ్య దాడి | land controversy between mla kamalamma and siva rama krishna | Sakshi
Sakshi News home page

ఎమ్మెల్యే కమలమ్మ-శివరామకృష్ణ వర్గీయుల మధ్య దాడి

Oct 15 2013 6:32 PM | Updated on Sep 1 2017 11:40 PM

ఓ స్థల వివాదానాకి సంబంధించి ఎమ్మెల్యే కమలమ్మ, శివరామకృష్ణ అనుచరులు పరస్పరం దాడికి దిగిన ఘటన పోరుమామిళ్లలో మంగళవారం చోటు చేసుకుంది.

వైఎస్సార్ జిల్లా:ఓ స్థల వివాదానాకి సంబంధించి ఎమ్మెల్యే కమలమ్మ, శివరామకృష్ణ అనుచరులు పరస్పరం దాడికి దిగిన ఘటన పోరుమామిళ్లలో మంగళవారం చోటు చేసుకుంది.  ఓ స్థల వివాదం ఎంతకీ పరిష్కారానికి రాకపోవడంతో శివరామకృష్ణ వర్గీయులు ఆగ్రహానికి లోనయ్యారు. దీంతో వారు కడప నుంచి రెండు లారీలలో పోరుమామిళ్లకు బయలుదేరారు. అనంతరం వివాదం పరిష్కారంలో తొలుత వాగ్వియుద్ధం చోటు చేసుకుంది.

 

అక్కడ ఎమ్మెల్యే కమలమ్మ అనుచరులు కూడా వారితో వాగ్విదానికి దిగడంతో ఘర్షణ మరింత రాజుకుంది. దీంతో ఇరువర్గాల అనుచరులు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఈఘటనలో కడప నుంచి వెళ్లిన నలుగురికి తీవ్ర గాయాలైయ్యాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement