పార్లమెంట్‌లో ఉగ్రవాది గా ప్రవర్తించిన ఎంపీ లగడపాటిని కఠినంగా శిక్షించాలని టీఆర్‌ఎస్ పొలిట్‌బ్యూరో సభ్యుడు కడియం శ్రీహరి డిమాండ్ చేశారు.
నయీంనగర్, న్యూస్‌లైన్ : పార్లమెంట్‌లో ఉగ్రవాది గా ప్రవర్తించిన ఎంపీ లగడపాటిని కఠినంగా శిక్షించాలని టీఆర్‌ఎస్ పొలిట్‌బ్యూరో సభ్యుడు కడియం శ్రీహరి డిమాండ్ చేశారు. హన్మకొండ టీఆర్‌ఎస్ జిల్లా పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ టీడీపీ బాటలోనే బీజేపీ నడుస్తుందన్నారు. 14 ఏళ్ల కేసీఆర్ పోరాటం ఫలితంగా ఏర్పడబోతున్న రాష్ట్రాన్ని అడ్డుకోవడానికి సీఎం కిరణ్, చంద్రబాబు చేయని కుట్ర లేదన్నారు.
చంద్రబాబు జాతీయ నాయకుల గడపగడప తిరిగి తెలంగాణ బిల్లును అడ్డుకోవడానికి సకల ప్రయత్నిస్తున్నాడని ఆరోపించారు. బీజేపీ ఇచ్చి న మాటను నిలబెట్టుకుని బిల్లుకు బేషరత్‌గా మద్దతు తెలపాలన్నారు. టీఆర్‌ఎస్ జిల్లా ఇన్‌చార్జ్ పెద్ది సుదర్శన్‌రెడ్డి, జిల్లా అధ్యక్షుడు తక్కెళ్లపల్లి రవీందర్‌రావు, నాయకులు బూజుగుండ్ల రాజేంద్రకుమార్, మార్నెని రవీందర్‌రావు, సంపత్, రాజేష్ పాల్గొన్నారు.