వివిధ రాష్ట్రాలలో జరిగిన తొక్కిసలాటలూ ... తీసుకున్న చర్యలు... 2004 సెప్టెంబర్‌లో జరిగిన కృష్ణా పుష్కరాలు
రాజమహేంద్రవరం క్రైం : వివిధ రాష్ట్రాలలో జరిగిన తొక్కిసలాటలూ ... తీసుకున్న చర్యలు... 2004 సెప్టెంబర్‌లో జరిగిన కృష్ణా పుష్కరాలు సందర్భంగా రెయిలింగ్ కూలిపోయిన ఘటనలో ఐదుగురు మృతి చెందారు. ఈ సంఘటన పై స్పందించిన అప్పటి ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి దివంగత నేత వై.ఎస్. రాజ శేఖరరెడ్డి ఎస్.ఇ, ఈఈలతోపాటు ఇతర అధికారులను సస్పెండ్ చేశారు. కాంట్రాక్టర్ లెసైన్స్‌ను బ్లాక్‌లిస్ట్‌లో పెట్టారు.
2008 ఆగస్టు 3న హిమాచల్ ప్రదేశ్‌లోని, బిలాస్‌పూర్ జిల్లా కొండ ప్రాంతంలో ఉన్న నయనా దేవి ఆలయం వద్ద జరిగిన తొక్కిసలాటలో 142 మంది మృతి చెందారు. ఈ సంఘటనపై స్పందించిన ముఖ్యమంత్రి ప్రేమ్ కుమార్ దూమల్ వెంటనే కేబినెట్ సమావేశం ఏర్పాటు చేసి తొక్కిసలాటకు సంబంధించిన అధికారులను సస్పెండ్ చేశారు.
2013 జులై 11న మద్యప్రదేశ్‌లోని భోపాల్‌లో దటియా జిల్లాలోని రతన్ ఘాట్ ఆలయం వద్ద వంతెన దాటే సమయంలో జరిగిన తొక్కిసలాటలో 31 మంది మహిళలు, 17 మంది చిన్నారులతోపాటు మొత్తం 115 మంది మృతి చెందారు. ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ జస్టిస్ ఎస్.కె. పాండే నేతృత్వంలో విచారణ కమిషన్‌ను ఏర్పాటు చేసి బాధ్యులైన జిల్లా కలెక్టర్ ఎస్.గీతా, పోలీస్ సూపరిటెండెట్ ప్రమోద్ వర్మ, సబ్ డివిజన్ మెజిస్ట్రేట్ మహిస్ తేజస్వీ, సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ బి.ఎన్. బసవిలను సస్పెండ్ చేశారు.
2014 అక్టోబర్ 3న పాట్నలో దసరా సందర్భంగా చోటుచేసుకున్న తొక్కిసలాటలో 33 మంది మహిళలు, 30 మంది చిన్నపిల్లలు మృత్యువాత పడ్డారు. దీనిపై ప్రిన్సిపల్ సెక్రటరీ అమీర్ సుభాని రిపోర్టు సబ్‌మిట్ చేశారు. ఈ సంఘటనకు బాధ్యులైన అధికారులు, సూపరెంటెండెంట్ ఆప్ పోలీస్, ట్రాఫిక్ పోలీసులను, రెవెన్యూ సిబ్బందిని, మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బందిని సస్పెండ్ చేశారు.
2015 జూలై 14న పుష్కరాలు సందర్భంగా రాజమహేంద్రవరం పుష్కర ఘాట్‌లో జరిగిన తొక్కిసలాటలో 29 మంది మృతి చెందగా, 51 మంది గాయాలు పాలయ్యూరు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన కుటుంబ సభ్యులు రెండు గంటలు ఘాట్‌లోనే ఉండిపోవడంతోనే తొక్కిసలాట చోటుచేసుకున్న విషయం బహిరంగ రహస్యం. దీనికి స్వయంగా బాధ్యుడైన చంద్రబాబు కిమ్మనకుండా కమిషన్ పేరుతో కాలక్షేపం చేస్తున్నారు.
గత ఏడాది
పుష్కరాలు సందర్భంగా పుష్కర ఘాట్‌లో జరిగిన తొక్కిసలాటలో 29 మంది మృతి చెందగా 52 మంది గాయాలు పాలైనా చంద్రబాబు సర్కారుకు చీమకుట్టినట్టైనా లేదు. నేను నిప్పును ... క్రమశిక్షణలో నా తరువాతే ఎవరైనా అంటూ తరచుగా గొప్పలకు పోతున్న ఇతర రాష్ట్రాల్ల ఈ విధంగా తొక్కిసలాటలు జరిగిన సందర్భాల్లో ఎలా స్పందించాయో ఓ సారి గమనిస్తే మంచిదని పలువురు అభిప్రాయపడుతున్నారు.