కుంటిసాకులు చెప్పొద్దు: కొత్తపల్లి | kothapalli subbarayudu slams ap govt over farm loan waiver | Sakshi
Sakshi News home page

కుంటిసాకులు చెప్పొద్దు: కొత్తపల్లి

Dec 1 2014 2:16 PM | Updated on Jun 4 2019 5:04 PM

కుంటిసాకులు చెప్పొద్దు: కొత్తపల్లి - Sakshi

కుంటిసాకులు చెప్పొద్దు: కొత్తపల్లి

వ్యవసాయ రుణాలు మాఫీ చేయకుండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కుంటిసాకులు చెబుతోందని వైఎస్సార్ కాంగ్రెస్ నాయకుడు కొత్తపల్లి సుబ్బారాయుడు విమర్శించారు.

నర్సాపురం(పశ్చిమగోదావరి జిల్లా): వ్యవసాయ రుణాలు మాఫీ చేయకుండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కుంటిసాకులు చెబుతోందని వైఎస్సార్ కాంగ్రెస్ నాయకుడు కొత్తపల్లి సుబ్బారాయుడు విమర్శించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు గుర్తుకు రాకపోతే ఎన్నికల మేనిఫెస్టో చదువుకోవాలని సూచించారు.

రుణమాఫీపై గట్టిగా నిలదీస్తుంటే చంద్రబాబు సింగపూర్ షికారు, జపాన్ జంప్ అన్నట్టుగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు తొలి సంతకం అమలు తీరు ఆపరేషన్ సక్సెస్.. షేపెంట్ డెడ్ అన్నట్టుగా ఉందని ఎద్దేవా చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement