`శాఖ మార్పు.. సమైక్యాంధ్ర కోసం కాదు` | Konathala ramakrishna takes on kiran kumar reddy | Sakshi
Sakshi News home page

`శాఖ మార్పు.. సమైక్యాంధ్ర కోసం కాదు`

Jan 3 2014 5:56 PM | Updated on Jul 29 2019 5:31 PM

`శాఖ మార్పు.. సమైక్యాంధ్ర కోసం కాదు` - Sakshi

`శాఖ మార్పు.. సమైక్యాంధ్ర కోసం కాదు`

తెలంగాణ ముసాయిదా బిల్లు రాష్ట్ర అసెంబ్లీలో ఉన్న ప్రస్తుత కీలక తరుణంలో శాసనసభ వ్యవహారాల శాఖ నుంచి మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు..

విశాఖపట్నం: తెలంగాణ ముసాయిదా బిల్లు రాష్ట్ర అసెంబ్లీలో ఉన్న ప్రస్తుత కీలక తరుణంలో శాసనసభ వ్యవహారాల శాఖ నుంచి మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబును తప్పించడంపై తెలంగాణలో సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మంత్రి శ్రీధర్బాబు శాఖ మార్పు అంశం ఇరు ప్రాంతాల్లో భావోద్వేగాలు పెంచడానికే తప్ప సమైక్యాంధ్ర కోసం ముఖ్యమంత్రి కిరణ్కుమార్ రెడ్డి చేసింది కాదని వైఎస్సార్ సీపీ రాజకీయ వ్యవహారాల కమిటీ కోఆర్డినేటర్ కొణతాల రామకృష్ణ విమర్శించారు. సమైక్య తీర్మానం అసెంబ్లీ చేయాల్సిందేనని కొణతాల పేర్కొన్నారు. కాగా, శ్రీధర్బాబు శాఖను మార్చి వాణిజ్య పన్నుల శాఖ అప్పగించడాన్ని పౌరసరఫరాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు తీవ్రంగా వ్యతిరేంచిన సంగతి తెలిసిందే.

Advertisement
 
Advertisement
Advertisement