నల్లగొండ జిల్లా భువనగిరి పట్టణ శివారులో ఆదివారం కోణార్క్ ఎక్స్‌ప్రెస్ రైలు లారీని ఢీకొట్టింది.
భువనగిరి,న్యూస్‌లైన్: నల్లగొండ జిల్లా భువనగిరి పట్టణ శివారులో ఆదివారం కోణార్క్ ఎక్స్‌ప్రెస్ రైలు లారీని ఢీకొట్టింది. దీంతో రైళ్లు, వాహనాల రాకపోకలకు కొద్దిసేపు అంతరాయం కలిగింది. భువనగిరి నుంచి జగదేవ్‌పూర్ వెళ్లే రోడ్డుమార్గంలో ఉన్న హన్మాపురం రైల్వే గేటును సికింద్రాబాద్ నుంచి పాట్నా వెళ్తున్న దురంతో ఎక్స్‌ప్రెస్ రైలు కోసం మూసివేశారు. ఆ రైలు వెళ్లిపోయిన తర్వాత మరో రైలు వస్తున్న సమాచారం తెలుసుకోకుండానే గేట్‌మ్యాన్ గేటు తీశాడు. దీంతో గేటు బయట నిలిచి ఉన్న లారీని డ్రైవర్ ముందుకు కదిలించాడు. ఇదే సమయంలో భువనేశ్వర్ నుంచి ముంబై వెళ్తున్న కోణార్క్ ఎక్స్‌ప్రెస్ రావడంతో ట్రాక్ దాటి వెళ్తున్న లారీ వెనుకభాగాన్ని ఢీకొట్టింది. దీంతో లారీ ట్రాక్‌పై కొద్దిదూరంలో ఎగిరిపడింది. ఈ ప్రమాదంతో సికింద్రాబాద్ వైపు వెళ్తున్న పలు రైళ్లు ఆలస్యంగా నడిచాయి.