
సాక్షి, యాదాద్రి: భువనగిరిలో లారీ బీభత్సం సృష్టించింది. బ్రేక్‌లు ఫెయిల్ కావడంతో అదుపు తప్పిన లారీ.. మూడు బైక్‌లను ఢీకొట్టి.. షాపులోకి దూసుకెళ్లింది. జగదేవ్‌పూర్ చౌరస్తాలో ఈ ఘటన జరగ్గా.. ముగ్గురు మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.
కాగా, మృతుల్లో ఒక వ్యక్తిని రాజపేట మండలం కురారం గ్రామానికి చెందిన రామకృష్ణ వాసిగా పోలీసులు గుర్తించారు. మరో వ్యక్తిని గుర్తించాల్సి ఉంది. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు భువనగిరి పోలీసులు తెలిపారు.