టి.మంత్రుల ఇళ్లు ముట్టడిస్తాం: కోమటిరెడ్డి | Komatireddy Venkat Reddy Demand for Telangana Ministers not Attend Cabinet Meeting | Sakshi
Sakshi News home page

టి.మంత్రుల ఇళ్లు ముట్టడిస్తాం: కోమటిరెడ్డి

Sep 19 2013 12:51 PM | Updated on Sep 1 2017 10:51 PM

టి.మంత్రుల ఇళ్లు ముట్టడిస్తాం: కోమటిరెడ్డి

టి.మంత్రుల ఇళ్లు ముట్టడిస్తాం: కోమటిరెడ్డి

తెలంగాణ మంత్రులు క్యాబినెట్ సమావేశానికి వెళ్లరాదని మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సూచించారు.

తెలంగాణ మంత్రులు క్యాబినెట్ సమావేశానికి వెళ్లరాదని మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సూచించారు. తెలంగాణ మంత్రులంతా తమ మంత్రి పదవులకు రాజీనామాలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. రాజీనామాలు చేయకుంటే వారి ఇళ్లను ముట్టడిస్తామని హెచ్చరించారు.

తెలంగాణ ఏర్పాటు చేయాలని కోరుతూ సీడబ్ల్యూసీ తీర్మానం చేసి నెలన్నర దాటుతున్న ఇంకా కేబినెట్‌ ముందుకు రాకపోవడంపై  అనుమానాలు వ్యక్తమవుతున్నాయని కోమటిరెడ్డి అంతకుముందు ఆందోళన వ్యక్తం చేశారు. 2009 నాటి పరిణామాలు పునరావృతమవుతాయనే భయం ప్రజల్లో వ్యక్తమవుతోందని అన్నారు. తెలంగాణ మంత్రుల్లో కొందరి ప్రవర్తన తలదించుకునేలా ఉందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement