
సాక్షి, విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్‌ను నాలెడ్జ్ సొసైటీగా తయారు చేయాలన్నదే తన విజన్ అని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. ఆ దిశగా సాంకేతిక పరిజ్ఞానం వినియోగానికి ప్రాధాన్యం ఇస్తున్నానని తెలిపారు. విశాఖపట్నంలో మూడు రోజులపాటు జరిగే ట్రాన్స్‌ఫార్మింగ్ ఎడ్యుకేషన్ కాన్ఫరెన్స్ ఫర్ హ్యుమానిటీ సదస్సును శనివారం చంద్రబాబు ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. అలాగే శనివారం విశాఖపట్నంలో ఏర్పాటు చేసిన హెలీ టూరిజంను సీఎం ప్రారంభించారు. కాగా రాష్ట్రంలో తొలిసారిగా విశాఖపట్నం అంతర్జాతీయ విమానాశ్రయంలో ఈ–వీసా సదుపాయాన్ని చంద్రబాబు ప్రారంభించారు. బాబు ఆదివారం మాల్దీవుల పర్యటనకు వెళ్లనున్నారు. మళ్లీ ఈ నెల 23వ తేదీన ఆయన తిరిగి రాష్ట్రానికి వస్తారు.