రచ్చబండ కార్యక్రమం కోసం ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి విశాఖపట్నం చేరుకున్నారు. శుక్రవారం ఉదయం బయల్దేరి ఆయన విశాఖపట్నం వెళ్లారు.
రచ్చబండ కార్యక్రమం కోసం ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి విశాఖపట్నం చేరుకున్నారు. శుక్రవారం ఉదయం బయల్దేరి ఆయన విశాఖపట్నం వెళ్లారు. శంషాబాద్ ప్రాంతంలో తీవ్రంగా పొగమంచు కమ్ముకోవడంతో ఆయన ప్రయాణం కొంత ఆలస్యమైంది.
అయితే.. ముఖ్యమంత్రి పర్యటన పేరు చెప్పి చోడవరంలో పోలీసులు ఓవరాక్షన్ చేశారు. రచ్చబండ కార్యక్రమం ఉందంటూ పలు దుకాణాలను బలవంతంగా మూయించారు. దీంతో పోలీసుల తీరు పట్ల వ్యాపారులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.