తొలి అడుగులోనే... | Kimidi Mrunalini Rural development Minister | Sakshi
Sakshi News home page

తొలి అడుగులోనే...

Jun 12 2014 1:45 AM | Updated on Aug 30 2019 8:37 PM

తొలి అడుగులోనే... - Sakshi

తొలి అడుగులోనే...

రాష్ట్ర ముఖ్యమం త్రి నారా చంద్రబాబునాయుడు మంత్రి మృణాళినికి రెండు శాఖలు కేటాయించారు. తొలుత ఆమె కు పౌర సరఫరా శాఖ కేటాయించినట్టు వార్తలు వచ్చినప్పటికీ

 విజయనగరం మున్సిపాలిటీ: రాష్ట్ర ముఖ్యమం త్రి నారా చంద్రబాబునాయుడు మంత్రి మృణాళినికి రెండు శాఖలు కేటాయించారు. తొలుత ఆమె కు పౌర సరఫరా శాఖ కేటాయించినట్టు వార్తలు వచ్చినప్పటికీ,..జాబితా అధికారికంగా ప్రకటించిన సమయానికి గ్రా మీణాభివృద్ధి శాఖతో పాటు గృహ నిర్మాణ శాఖ కేటాయించారు. వాస్తవానికి చంద్రబాబు కేబినేట్‌లో చాలామంది మంత్రులకు ఒక్కొక్క శాఖనే కేటాయించగా...మృణాళినికి మాత్రం జోడు శాఖలు కట్టబెట్టారు. కాగా మృణాళిని తొలి అడుగులోనే ఎమ్మెల్యేగా గెలు పొందడంతో పాటు రాష్ట్ర కేబినేట్‌లో చోటు దక్కించుకోవడం, అందులో నూ ప్రాధాన్యత ఉన్న రెండు పదవులను ఆమెకు కేటాయించడం అరుదైన అవకాశంగానే చెప్పవచ్చు. ఆమెకు రెండు శాఖలు కేటాయించడంతో జిల్లాలోని పార్టీ శ్రేణులు ఆనందం వ్యక్తం చేస్తున్నాయి.
 
 సత్యదేవుని సన్నిధిలో మంత్రి
 అన్నవరం: మంత్రి కిమిడి మృణాళిని తన కుటుంబ సభ్యులతో బుధవారం సాయంత్రం అన్నవరంలోని సత్యదేవుని దర్శించుకున్నారు. వారికి ఆలయం వద్ద దేవస్థానం ఏసీ ఈరంకి జగన్నాథరావు ఆధ్వర్యంలో పండితులు ఘనంగా స్వాగతం పలికారు. స్వామి దర్శనానంతరం వేద పండితు లు వేదాశీస్సులు అందజేయగా, ప్రసాదాలను ఏసీ అందజేశారు. వారితో పాటు దేవస్థానం ఇన్‌చార్జి పీఆర్‌ఓ డీవీఎస్ కృష్ణారావు ఉన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement