భర్త చేతిలో హతం? | Killed at the hands of her husband? | Sakshi
Sakshi News home page

భర్త చేతిలో హతం?

Jul 25 2015 2:19 AM | Updated on Sep 3 2017 6:06 AM

భర్త చేతిలో హతం?

భర్త చేతిలో హతం?

భర్త చేతిలో భార్య హతమైంది. ఈ ఘటన రొంపిచెర్ల వుండలం బొవ్ముయ్యుగారిపల్లె పంచాయుతీ ఫజలుపేటలో విషాదాన్ని

రొంపిచెర్ల: భర్త చేతిలో భార్య హతమైంది. ఈ ఘటన రొంపిచెర్ల వుండలం బొవ్ముయ్యుగారిపల్లె పంచాయుతీ ఫజలుపేటలో విషాదాన్ని నింపింది. స్థానికుల కథనం మేరకు.. అనంతపురం జిల్లా కూలికుంటకు చెందిన తస్లీమ్(25), జిలానీ (29)కి ఆరేళ్ల క్రితం వివాహమైం ది. వీరు రొంపిచెర్ల వుండలం ఫజులుపేటలో నివాసముంటున్నారు. జిలాని వెల్డింగ్ పనిచేసేవాడు. వీరికి అవూల్(5), అల్మాన్(3) పిల్లలు. జిలానీ రోజూ తప్పతాగి  తరచూ భార్యతో గొడవపడేవాడు. శుక్రవారం రాత్రి 8 గంటలకు బంధువులు వచ్చి తలుపులు తట్టినా తెరవలేదు.

దీంతో ఇంటిపైకి వెళ్లి చూశారు. తస్లీమ్ వుంచంపై పడి ఉంది. ఆమెను కదిలిం చినా కదల్లేదు. ఆమె గొంతుచూట్టు గాయూలు ఉండడంతో భర్త జిలానీ ఉరివేసి చంపి వేసి ఉంటాడని స్థాని కులు అనువూనిస్తున్నారు. ఆపై ఆగ్రహంతో జిలానీకి దేహశుద్ధిచేసి పోలీసులకు అప్పగించారు. తల్లిదండ్రులు దూరమవ్వడంతో పిల్లలు అనాథలయ్యారు. ఎస్‌ఐ రహీవుుల్లా కేసు దర్యాప్తు చేస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement