ఖాకీ సైంటిస్ట్ | Khaki scientist | Sakshi
Sakshi News home page

ఖాకీ సైంటిస్ట్

May 15 2014 2:15 AM | Updated on Aug 21 2018 6:21 PM

రాష్ట్ర పోలీసు డెరైక్టర్ జనరల్ (డీజీపీ) బయ్యారపు ప్రసాదరావుకు సమాజం, సైన్స్ రెండు కళ్లు లాంటివి. ఒకవైపు పోలీస్ బాస్‌గా రాష్ట్రంలో శాంతి భద్రతలను పరిరక్షిస్తూనే... మరోవైపు భౌతిక శాస్త్రంలో విలువైన పరిశోధనలు చేస్తున్నారు.

ఎస్కేయూ, న్యూస్‌లైన్ : రాష్ట్ర పోలీసు డెరైక్టర్ జనరల్ (డీజీపీ) బయ్యారపు ప్రసాదరావుకు సమాజం, సైన్స్ రెండు కళ్లు లాంటివి. ఒకవైపు పోలీస్ బాస్‌గా రాష్ట్రంలో శాంతి భద్రతలను పరిరక్షిస్తూనే... మరోవైపు భౌతిక శాస్త్రంలో విలువైన పరిశోధనలు చేస్తున్నారు. వృత్తి రీత్యా, ప్రవృత్తి రీత్యా సమాజ శ్రేయస్సుకు పాటుపడుతున్నారు. ఆయన పరిశోధనలకు గాను శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం బుధవారం డాక్టరేట్ ప్రదానం చేసింది. ప్రసాదరావు యూజీసీ-బీఎస్‌ఆర్ ఎమిరేటర్స్ శాస్త్రవేత్త ఆచార్య రాజూరి రామకృష్ణారెడ్డి పర్యవేక్షణలో ‘స్టడీస్ ఆన్ వేవ్-పార్టికల్ డ్యూయల్టీ ఆఫ్ లైట్’ అనే అంశంపై పరిశోధన చేశారు. వర్సిటీలోని ఫిజిక్స్ విభాగంలో జరిగిన వైవాలో ఆయన తన పరిశోధన గురించి వివరించారు.
 
 కాంతి.. కణ-తరంగ స్వభావాలు కలిగి ఉంటుందని న్యూటన్,హేగెన్, ప్రేనల్ లాంటి శాస్త్రవేత్తలు నిరూపించారు. న్యూటన్ కాంతి సిద్ధాంతాన్ని బలపరుస్తూ ప్రసాదరావు పరిశోధన కొనసాగింది. ప్రతి వస్తువుపై ఫ్లూయిడ్ కొద్ది మోతాదులో ఉంటుందని, దీనిపై ఒత్తిడి కలగజేస్తే న్యూటన్  వలయాల రూపంలో ఉన్న సాంద్రత తరంగాలు విస్తరిస్తాయని తన పరిశోధన ద్వారా నిరూపించారు. చమురు, సబ్బు నీరు తదితర ద్రవ పదార్థాలపై ఒత్తిడిని కలగజేసి... దీనివల్ల కలిగే న్యూటన్ వలయాలను విశ్లేషించి కాంతి స్వభావాన్ని తెలియజేశారు. కాంతితో కలసికట్టుగా ఉండే పోటాన్లను క్వాంటమ్ సిద్ధాంతం ద్వారా విశ్లేషించారు. ‘వ్యతికరణం-వివర్తనం’ అనే భావనలు కణ సిద్ధాంతంపై ఆధారపడి పనిచేస్తాయని వివరించారు.
 
 కానిస్టేబుల్ కొడుకు..
 అసాధారణ మేధావి
 డీజీపీ ప్రసాదరావు తండ్రి శ్రీనివాస్ ఒక సాధారణ కానిస్టేబుల్. ప్రసాదరావు చిన్నతనం నుంచే కష్టపడి ఈ స్థాయికి ఎదిగారు. పదో తరగతిలో రాష్ట్రంలో 13వ ర్యాంకు సాధించారు. ఇంటర్, డిగ్రీ విజయవాడ లయోలా కాలేజీలో చదివా రు. మద్రాసు ఐఐటీలో ఎమ్మెస్సీ పూర్తి చేశారు. ఆ వెంటనే జూనియర్ లెక్చరర్‌గా ఎంపికై ప్రకాశం జిల్లా తాళ్లూరులో పనిచేశారు.
 
 రెండు నెలలు తిరగక ముందే ఎస్‌బీఐలో ప్రొబేషనరీ ఆఫీసర్ (పీఓ) ఉ ద్యోగం వచ్చింది. ఉద్యోగం చేస్తూనే వైజాగ్‌లో సివిల్ సర్వీసెస్‌కు సన్నద్ధమయ్యా రు. ఫిజిక్స్, కెమిస్ట్రీ ఆప్షనల్స్‌గా తొ లి ప్రయత్నంలోనే ఐపీఎస్ సాధించారు. అత్యున్నత పోలీసు అధికారిగానే కా కుం డా ఓ శాస్త్రవేత్తగా, పరిశోధకుడిగా ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు.

 అభినందనల వెల్లువ
 డాక్టరేట్ పొందిన డీజీపీ ప్రసాదరావును ఎస్కేయూ వీసీ ఆచార్య రామకృష్ణారెడ్డి ప్రత్యేకంగా అభినందించారు. వైవాకు వీసీ కూడా హాజరై రెండు గంటల పాటు ప్రసాదరావు వివరించిన విషయాలను ఆసక్తిగా విన్నారు. సర్వీసు అనంతరం ఆయన్ను ఎస్కేయూ విజిటింగ్ ప్రొఫెసర్‌గా తీసుకుంటామని తెలిపారు.
 
 అందరికీ థ్యాంక్స్
 తాను నాలుగేళ్లుగా ఎస్కేయూలో పరిశోధనలు చేస్తున్నానని డీజీపీ ప్రసాదరావు తెలి పారు. తనకు సహకరిం చిన ఆచార్య రాజూరి రామకృష్ణారెడ్డి, వీసీ కాడా రామకృష్ణారెడ్డి, రిజిస్ట్రార్ ఆచా ర్య గోవిందప్ప, సహాయ ఆచార్యులు రామగోపాల్ తో పాటు తోటి పరిశోధక విద్యార్థులకు ఆయన కృతజ్ఞతలు  తెలిపారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement