స్టౌ పేలి భార్యాభర్తలకు గాయాలు | Kerosene stove blast in anathpur district | Sakshi
Sakshi News home page

స్టౌ పేలి భార్యాభర్తలకు గాయాలు

Apr 4 2016 12:51 PM | Updated on Sep 3 2017 9:12 PM

వంట చేస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు కిరోసిన్ స్టవ్ పేలి భార్యా భర్తలకు గాయాలయ్యాయి.

ధర్మవరం: వంట చేస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు కిరోసిన్ స్టవ్ పేలి భార్యా భర్తలకు గాయాలయ్యాయి. ఈ సంఘటన అనంతపురం జిల్లా ధర్మవరంలో సోమవారం ఉదయం చోటు చేసుకుంది. కోలకత్తాకు చెందిన బబ్లూ, జాస్మీన్ భార్యాభర్తలు స్థానికంగా పట్టుచీరలపై డిజైన్‌లు వేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు.

 

ఈ క్రమంలో ఈ రోజు వంట చేయడానికి ప్రయత్నిస్తుండగా.. స్టవ్ పేలింది. దీంతో మంటలు ఎగిసిపడి జాస్మీన్ కు అంటుకున్నాయి. ఇది గుర్తించిన భర్త ఆమెను కాపాడటానికి ప్రయత్నించడంతో.. అతనికి కూడా మంటలు అంటుకున్నాయి. స్థానికులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.

Advertisement
 
Advertisement
Advertisement