కాంగ్రెస్ పార్టీ వైఖరిపై రాష్ట్ర మంత్రి కాసు కృష్ణారెడ్డి ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పార్టీకి తెలుగు ప్రజలు సరైన సమయంలో బుద్ధి చెబుతారని ఆయన విమర్శించారు.
హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ వైఖరిపై రాష్ట్ర మంత్రి కాసు కృష్ణారెడ్డి ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పార్టీకి తెలుగు ప్రజలు సరైన సమయంలో బుద్ధి చెబుతారని ఆయన విమర్శించారు.
రాష్ట్ర విభజనను అడ్డుకునేందుకు తన సర్వశక్తులు వడ్డి ప్రయత్నించానని కాసు చెప్పారు. అయితే, కాంగ్రెస్ హై కమాండ్ తమల్ని పట్టించుకోలేదని వాపోయారు. రాష్ట్ర విభజన విషయంలో సీమాంధ్ర ప్రజల అభీష్టానికి భిన్నంగా కాంగ్రెస్ వ్యవహరిస్తుండటంతో ఆ పార్టీపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. సీమాంధ్రకు చెందిన కాంగ్రెస్ నేతలకు సమైక్యాంధ్రుల నుంచి సెగ ఎదురవుతోంది.