ఆరనీకుమా ఈ దీపం...కార్తీక దీపం..! | kartik purnima festival in srikakulam | Sakshi
Sakshi News home page

ఆరనీకుమా ఈ దీపం...కార్తీక దీపం..!

Nov 7 2014 4:08 AM | Updated on Sep 2 2018 4:48 PM

ఆరనీకుమా ఈ దీపం...కార్తీక దీపం..! - Sakshi

ఆరనీకుమా ఈ దీపం...కార్తీక దీపం..!

కార్తీక పౌర్ణమి పూజలు, వ్రతాలను జిల్లా వాసులు గురువారం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. మహిళలు నదులు, చెరువులు, కాలువల్లో పుణ్యస్నానాలాచరించి

శ్రీకాకుళం కల్చరల్/ఎచ్చెర్ల రూరల్:కార్తీక పౌర్ణమి పూజలు, వ్రతాలను జిల్లా వాసులు గురువారం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. మహిళలు నదులు, చెరువులు, కాలువల్లో పుణ్యస్నానాలాచరించి అరటి దొప్పలపై కార్తీక దీపాలు వెలిగించి పూజలు చేశారు. దీప కాంతుల వలే జీవితాల్లో వెలుగులు ప్రసరింపజేయాలని ప్రార్థించారు. దేవాదాయశాఖ ఆధ్వర్యంలో ఉమారుద్ర కోటేశ్వరస్వామి ఆలయ ఈవో సన్యాసిరాజు, అర్చకు డు శ్రీరామ్మూర్తిలు ముందుగా ఉమారుద్రునికి ప్రత్యేక పూజలు నిర్వహిం చారు. అనంతరం నాగావళి న దికి హారతులిచ్చారు. కార్తీక పూజలకు హాజరైన భక్తులతో నాగావళి నదీతీరం సంద డిగా మారింది. అలాగే, కుంచాలకూర్మయ్యపేట వద్దనున్న దేవీ ఆశ్రమంలోని 1001 శ్రీ చక్రాలకు ఆలయ నిర్వాహకుడు బాలభాస్కరశర్మ ఆధ్వర్యం లో భక్తులు కుంకుమార్చనలు జరి పారు. లలిత పారాయణం చేశారు. అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించారు. సాయంత్రం శ్రీచక్రాల వద్ద దీపాలంకరణ చేశారు. పౌర్ణమి వేడుకల్లో వందలాది మంది భక్తులు పాల్గొన్నారు.   
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement