అశోక్‌బాబూ నీవి ఒంటెత్తు పోకడలు: కారెం | Karem Shivaji fire on Ashok Babu | Sakshi
Sakshi News home page

అశోక్‌బాబూ నీవి ఒంటెత్తు పోకడలు: కారెం

Dec 23 2013 1:39 AM | Updated on Sep 2 2017 1:51 AM

అశోక్‌బాబూ నీవి ఒంటెత్తు పోకడలు: కారెం

అశోక్‌బాబూ నీవి ఒంటెత్తు పోకడలు: కారెం

‘అశోక్‌బాబూ నీవి ఒంటెత్తు పోకడలు. నీవల్లే సమైక్య ఉద్యమం నీరుగారుతోంది. నీవల్లే సమైక్య ఉద్యమానికి ప్రజా సంఘాలు దూరమవుతున్నాయి’ అని మాలమహానాడు రాష్ట్ర అధ్యక్షుడు, సమైక్య ఉద్యమ పరిరక్షణ సమితి ఉపాధ్యక్షుడు కారెం శివాజీ ఆగ్రహం వ్యక్తం చేశారు

 సాక్షి, రాజమండ్రి: ‘అశోక్‌బాబూ నీవి ఒంటెత్తు పోకడలు. నీవల్లే సమైక్య ఉద్యమం నీరుగారుతోంది. నీవల్లే సమైక్య ఉద్యమానికి ప్రజా సంఘాలు దూరమవుతున్నాయి’ అని మాలమహానాడు రాష్ట్ర అధ్యక్షుడు, సమైక్య ఉద్యమ పరిరక్షణ సమితి ఉపాధ్యక్షుడు కారెం శివాజీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం రాజమండ్రిలో శివాజీ విలేకరులతో మాట్లాడారు. సమైక్య ఉద్యమం పట్ల అశోక్‌బాబు వ్యవహరిస్తున్న తీరుపై ఆయన విరుచుకుపడ్డారు.
 
 అశోక్‌బాబు అవలంబిస్తున్న పోకడల కారణంగా ఉద్యోగులు ఉద్యమానికి దూరమవుతున్నారని చెప్పారు. ఆయన వల్లే ఎన్జీవోల నడుమ అంతర్గత విభేదాలు పెచ్చుమీరిపోయాయని, ఆధిపత్య పోరు కొనసాగుతోందని ఆరోపించారు. ఎన్జీవో నేతలు వ్యక్తిగత దూషణలతో సమైక్య ఉద్యమాన్ని నీరు గారుస్తున్నారని విమర్శించారు.

Advertisement
 
Advertisement
Advertisement