కాపు సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం | kapu welfare state goal | Sakshi
Sakshi News home page

కాపు సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం

Mar 4 2016 12:52 AM | Updated on Sep 3 2017 6:55 PM

కాపుల అభివృద్ధి కోసం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట్ర కాపు కార్పొరేషన్ చైర్మన్ చలమశెట్టి రామానుజయ స్పష్టం చేశారు.

 కాపు కార్పొరేషన్ చైర్మన్ రామానుజయ  

 కొరిటెపాడు (గుంటూరు) :   కాపుల అభివృద్ధి కోసం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట్ర కాపు కార్పొరేషన్ చైర్మన్ చలమశెట్టి రామానుజయ స్పష్టం చేశారు. పార్టీ జిల్లా కార్యాలయంలో గురువారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కాపులను బీసీల్లో చేర్చేందుకు అన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పారు. 22 ఏళ్ల నుంచి కాపుల గురించి ఏనాడు మాట్లాడని ముద్రగడ పద్మనాభం రెండు నెలలుగా కాపులపై కపట కన్నీరు కారుస్తున్నారని ఎద్దేవా చేశారు. ఎమ్మెల్యేగా, మంత్రిగా, పార్లమెంటు సభ్యుడిగా ఉన్నప్పుడు పనుల కోసం కాపులు నా వద్దకు రావద్దన్న ముద్రగడ నేడు కాపులపై ప్రేమ ఎందుకు చూపుతున్నారో అర్థం కావటంలేదన్నారు. టీడీపీ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నింటినీ నిలబెట్టుకుంటుందని స్పష్టం చేశారు. ఎమ్మెల్సీ సి.రామచంద్రయ్యకు సీఎంను విమర్శించే నైతిక అర్హత లేదన్నారు. సమావేశంలో టీడీపీ కాపు నాయకులు బొబ్బిలి రామారావు, యర్రగోపు నాగేశ్వరరావు, పోతురాజు ఉమాదేవి, అడపా బాబు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement