గంటా వర్గం నుంచి అయ్యన్న వర్గం వైపు... | kannababu joins ayyanna patrudu group | Sakshi
Sakshi News home page

గంటా వర్గం నుంచి అయ్యన్న వర్గం వైపు...

Jun 17 2015 10:23 AM | Updated on Mar 23 2019 9:03 PM

గంటా వర్గం నుంచి అయ్యన్న వర్గం వైపు... - Sakshi

గంటా వర్గం నుంచి అయ్యన్న వర్గం వైపు...

టీడీపీ మంత్రులు గంటా శ్రీనివాసరావు, చింతకాయల అయ్యన్నపాత్రుడు మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతోంది.

విశాఖపట్నం: టీడీపీ మంత్రులు గంటా శ్రీనివాసరావు, చింతకాయల అయ్యన్నపాత్రుడు మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతోంది. వీరి మధ్య కొనసాగుతున్న రాజకీయ వైరం  తాజాగా మరోసారి  బట్టబయలైంది. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో సీటు దక్కకపోవడంతో విశాఖ జిల్లా టీడీపీ నేత ఉప్పలపాటి వెంకట రమణ మూర్తిరాజు(కన్నబాబురాజు) రెబల్ అభ్యర్థిగా బరిలోకి దిగారు. చంద్రబాబు తనకు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదంటూ ఆయన ఎమ్మెల్సీ ఎన్నికల్లో తిరుగుబాటు అభ్యర్థిగా పోటీకి దిగారు.

అయితే అయ్యన్నపాత్రుడితో కలిసి ఆయన బుధవారం హైదరాబాద్ లో ప్రత్యక్ష మయ్యారు. ఆయనను అయ్యన్నపాత్రుడు స్వయంగా సీఎం చంద్రబాబుకు వద్దకు తీసుకొచ్చారు. కన్నబాబును బుజ్జగించి నామినేషన్ ఉపసంహరింప జేసేందుకు అయ్యన్నపాత్రుడు ప్రయత్నిస్తున్నారు. కాగా నిన్నటివరకు తమ వర్గంలో ఉండి ఒక్కసారిగా అయ్యన్నపాత్రుడు వైపు కన్నబాబు చేరడంతో మంత్రి గంటా వర్గం అవాక్కయింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement