‘కళ్యాణ వైభోగమే’ చిత్ర యూనిట్ సందడి | " Kalyana Vaibhogame ' movie unit | Sakshi
Sakshi News home page

‘కళ్యాణ వైభోగమే’ చిత్ర యూనిట్ సందడి

Mar 10 2016 12:51 AM | Updated on Sep 3 2017 7:21 PM

‘కళ్యాణ వైభోగమే’ చిత్ర యూనిట్ సందడి

‘కళ్యాణ వైభోగమే’ చిత్ర యూనిట్ సందడి

‘కళ్యాణ వైభోగమే’ చిత్ర విజయం...ప్రేక్షకుల విజయమని చిత్ర కథానాయకుడు నాగశౌర్య అన్నారు.

విజయవాడ(గాంధీనగర్) :  ‘కళ్యాణ వైభోగమే’ చిత్ర విజయం...ప్రేక్షకుల విజయమని చిత్ర కథానాయకుడు నాగశౌర్య అన్నారు. శ్రీరంజిత మూవీస్ బ్యానర్‌పై నిర్మించిన కళ్యాణ వైభోగమే చిత్ర విజయోత్సవంలో భాగంగా యూనిట్ సభ్యులు బుధవారం శకుంతల థియేటర్‌కు విచ్చేశారు. ప్రేక్షకులను కలిసి చిత్ర విశేషాలు తెలుసుకున్నారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నాగశౌర్య మాట్లాడుతూ తాను విజయవాడ నగర వాసినేనన్నారు. తాను ఇదే థియేటర్‌లో తన అభిమాన నటుల సినిమాలు చూసేవాడినన్నారు. హీరోగా ఇక్కడికి రావడం, తనను ప్రేక్షకులు ఆదరించడం సంతోషంగా ఉందన్నారు.

చిత్రదర్శకులు బి.వి.నందినిరెడ్డి మాట్లాడుతూ కుటుంబ సమేతంగా చూడదగ్గ చిత్రమన్నారు. చిత్ర విజయానికి కారకులైన ప్రేక్షకులను అభినందించారు. ప్రేక్షకుల ఆదరణే తమకు ఉత్సహాన్నిస్తుందన్నారు. చిత్రం తాము ఆశించినదానికంటే విజయవంతమైందన్నారు. రాబోయే చిత్రాలను ఆదరించాలని కోరారు. కార్యక్రమంలో కృష్ణాజిల్లా చిత్రపంపిణీదారులు మిక్కిలినేని సుధాకర్, థియేటర్ ఎఎల్‌ఎస్‌ఆర్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement