ప్రేక్షకుల మదిలో స్థానమే లక్ష్యం | Kalki Raja interview | Sakshi
Sakshi News home page

ప్రేక్షకుల మదిలో స్థానమే లక్ష్యం

Dec 19 2014 2:05 AM | Updated on Aug 20 2018 6:18 PM

ప్రేక్షకుల మదిలో స్థానమే లక్ష్యం - Sakshi

ప్రేక్షకుల మదిలో స్థానమే లక్ష్యం

నటించిన సినిమా లేదా సీరియల్ పేరునే ఇంటిపేరుగా మలుచుకున్న వారు చాలా కొద్ది మందే ఉంటారు. అలాంటి కొద్ది మందిలో ఒకరు ‘కల్కి’ రాజ్.

బొబ్బిలి: నటించిన సినిమా లేదా సీరియల్ పేరునే ఇంటిపేరుగా మలుచుకున్న వారు చాలా కొద్ది మందే ఉంటారు. అలాంటి కొద్ది మందిలో ఒకరు ‘కల్కి’ రాజ్. టీవీ సీరియళ్లతో జనాలకు చేరువైన ఆయన ఇప్పుడు సినిమాల్లోనూ రాణిస్తున్నారు. విశాఖకు చెందిన తెలగారెడ్డి రాజా ఇప్పుడు కల్కి రాజ్‌గా ప్రేక్షకులను అలరిస్తున్నారు. గురువారం బొబ్బిలి వచ్చిన ఆయన సాక్షితో ఇలా ముచ్చటించారు.  
 
  మీ నేపథ్యం ఏంటి?
  నాది విశాఖ పట్నం. ఎంబీఏ వరకూ చదువుకొని ఐసీఐసీఐలో ఉద్యోగం చేశాను.
 
  మరి టీవీ అవకాశాలు ఎలా వచ్చాయి?
  నా మిత్రుడు ద్వారా టీవీలో నటించే అవకాశం వచ్చింది.
 
  ఇంతకీ మీ పేరు ముందు కల్కి ఎలా వచ్చింది?
 నేను నాలుగేళ్ల కిందట కల్కి సీరియల్‌లో ప్రధాన పాత్ర వే శాను. అది బాగా పాపులర్ అయ్యి ఇప్పుడు అందరూ కల్కిరాజ్ అని పిలుస్తున్నారు.
 
  ఇప్పటివరకూ మీరు చేసిన సీరియల్స్ ఏమిటి?
  ఇప్పటి వరకూ ఏడు సీరియల్స్ చేశాను. అన్నింటిలోనూ హీరో పాత్రలే చేశాను. క్రాంతి, అడగక ఇచ్చిన హామీలు, చిన్న కొడుకు, ఆడదే ఆధారం, మమతల కోవెల, పుత్తడి బొమ్మ, ముద్దుబిడ్డలో నటించాను.
 
  సినిమాలో అవకాశం ఎలా వచ్చింది?
 టీవీ సీరియల్స్‌లో ప్రధాన పాత్రలు వేస్తుండడంతో సినిమాల్లో అవకాశాలు వచ్చాయి. శ్రీకాంత్ హీరోగా వచ్చిన మల్లిగాడు మ్యారేజ్ బ్యూరోలో ప్రధాన పాత్ర పోషించాను. ఇప్పుడు రెండో సినిమా చేస్తున్నాను.
 
 బ్యాంకు ఉద్యోగంలో ఉండగా అవకాశాలు వచ్చాయి. నటనలో ఏమైనా శిక్షణ తీసుకున్నారా?
 అవును ఒకే సారి ఉద్యోగం నుంచి నటుడిని అయ్యాను. ఇది ఊహించలేనిది. ఈ ఫీల్డు అంటే ఆసక్తి ఉంది కానీ అప్పటికి ఏ ప్రయత్నాలూ చేయలేదు. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ దీనిలో రాణించడానికి దేవదాసు కనకాల ఫిల్మ్ ఇనిస్టిట్యూట్‌లో రెండు నెలల శిక్షణ తీసుకున్నాను.
 
  మీ లక్ష్యం ఏమిటి?
  ప్రేక్షకులు ఆదరించే పాత్రలు వేసి, మంచినటుడుగా వారి మనసులో స్థానం సంపాదించడమే లక్ష్యం. అందుకు నిరంతరం శ్రమిస్తాను.
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement