కళానికేతన్లో చోరీ ఛేదించిన పోలీసులు | Kalanikethan robbery case solved by vijayawada city police | Sakshi
Sakshi News home page

కళానికేతన్లో చోరీ ఛేదించిన పోలీసులు

Jun 13 2015 9:29 AM | Updated on Aug 30 2018 5:24 PM

కళానికేతన్లో చోరీ ఛేదించిన పోలీసులు - Sakshi

కళానికేతన్లో చోరీ ఛేదించిన పోలీసులు

నగరంలోని కళానికేతన్లో నగదు చోరీ కేసును పోలీసులు శనివారం ఛేదించారు. నిందితుడు కళానికేతన్లోని సేల్స్ బాయ్ అని పోలీసులు గుర్తించారు.

విజయవాడ: నగరంలోని కళానికేతన్లో నగదు చోరీ కేసును పోలీసులు శనివారం ఛేదించారు. నిందితుడు కళానికేతన్లోని సేల్స్ బాయ్ అని పోలీసులు గుర్తించారు. అనంతరం అతడని అదుపులోకి తీసుకుని... తమదైన శైలిలో విచారణ జరిపారు. అంతే పని చేసే షాపులో చోరీ చేసింది తానే అని పోలీసులు ఎదుట ఒప్పుకున్నాడు. చోరీ చేసిన రూ. 7.5 లక్షల నగదుకు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అతడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

విజయవాడ బందరు రోడ్డులోని కళానికేతన్ లో జూన్ 10వ తేదీ అర్థరాత్రి భారీ చోరీ జరిగింది. షాపులో ని రూ. 7.5 లక్షలు నగదు చోరీ జరిగింది. జూన్ 11వ తేదీ ఉదయం దొంగతనం జరిగిన సంగతి గుర్తించిన యజమానాలు వెంటనే మాచవరం పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సిబ్బందే ఈ చోరీ చేసి ఉండవచ్చని భావించిన పోలీసులు ఆ దిశగా విచారణ చేపట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement