జూనియర్ ఎన్టీఆర్ అభిమాని శ్రీనిధి కన్నుమూత | Junior NTR fan passes away Srinidhi | Sakshi
Sakshi News home page

జూనియర్ ఎన్టీఆర్ అభిమాని శ్రీనిధి కన్నుమూత

May 21 2015 2:17 AM | Updated on Apr 3 2019 4:24 PM

జూనియర్ ఎన్టీఆర్ అభిమాని శ్రీనిధి కన్నుమూత - Sakshi

జూనియర్ ఎన్టీఆర్ అభిమాని శ్రీనిధి కన్నుమూత

గతకొద్ది రోజులుగా మృత్యువుతో పోరాడుతున్న జూనియర్ ఎన్టీఆర్ అభిమాని శ్రీనిధి కన్నుమూసింది.

హైదరాబాద్: గతకొద్ది రోజులుగా మృత్యువుతో పోరాడుతున్న జూనియర్ ఎన్టీఆర్ అభిమాని శ్రీనిధి కన్నుమూసింది. బ్లడ్ క్యాన్సర్‌తో బాధపడుతున్న చిన్నారి శ్రీనిధి గత కొద్దిరోజులుగా హైదరాబాద్ కూకట్‌పల్లి రాందేవ్‌రావు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విష యం తెలిసిందే. ఈ నెల 12వ తేదీన శ్రీనిధి కోరిక మేరకు జూనియర్  ఎన్టీఆర్ ఆమెను పరామర్శించారు.

వరంగల్ జిల్లా వర్ధన్నపేటకు చెందిన శివాజి కుమార్తె శ్రీనిధి(10) ఆరో తరగతి చదువుతోంది. మూడేళ్ల క్రితం శ్రీనిధికి నడుమునొప్పి రావడంతో తల్లిదండ్రులు వైద్యులకు చూపించగా బ్లడ్‌క్యాన్సర్ అని తేల్చారు. దీంతో ఆ చిన్నారికి మెరుగైన వైద్యం అందించేందుకు శతవిధాలా ప్రయత్నించారు. అయినా ఆరోగ్యం కుదుటపడకపోగా మరింత పరిస్థితి విషమించింది.
 

Advertisement
 
Advertisement
Advertisement