ఏపీలో జూనియర్ డాక్టర్ల సమ్మె కొనసాగుతోంది.
అనంతపురం: ఏపీలో జూనియర్ డాక్టర్ల సమ్మె కొనసాగుతోంది. సమ్మె విరమణకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో జూనియర్ డాక్టర్లు తమ ఆందోళనలు ఉధృతం చేశారు. ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ అనంతపురంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. సప్తగిరి సర్కిల్ వద్ద మానవహారంగా ఏర్పడి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
తక్షణమే 107 నెంబర్ జీవోను ఉప సంహరించాలంటూ డిమాండ్ చేశారు. చర్చలకు తాము సిద్ధంగా ఉన్నా, ప్రభుత్వమే నిర్లక్ష్యం చేస్తుందన్నారు. అంతేకాక తమపై దుష్ప్రచారం చేస్తోందని జూనియర్ డాక్టర్లు ఆరోపించారు.
**