
శ్రీవారి సేవలో జూనియర్ ఎన్‌టీఆర్
తిరుమల శ్రీవారిని ప్రముఖ సినీ హీరో జూనియర్ ఎన్టీర్ దర్శించుకున్నారు
తిరుమల: తిరుమల శ్రీవారిని ప్రముఖ సినీ హీరో జూనియర్ ఎన్టీర్ దర్శించుకున్నారు. ఆయన తన సతీమణి లక్ష్మీప్రణతితో కలిసి మంగళవారం తెల్లవారుజామున సుప్రభాత సేవలో పాల్గొన్నారు. ప్రముఖ దర్శకుడు కొరటాల శివ కూడా శ్రీవేంకటేశ‍్వరస్వామిని దర్శించుకున్నారు. ప్రస్తుతం.. కె.ఎస్. రవీంద్ర(బాబీ) దర్శకత్వంలో నందమూరి కల్యాణ్‌రామ్ నిర్మిస్తున్న ‘జై లవకుశ’ చిత్రంలో ఎన్టీఆర్ నటిస్తున్నారు.