breaking news
laxmi pranthi
-
సంతోషమే
జీవితంలో ప్రీషియస్ మూమొంట్స్ కొన్నే ఉంటాయి. బర్త్‌డే, లైఫ్‌లో ఫస్ట్ జాబ్, పెళ్లి ఇలాంటివి కొన్ని. వీటిని మనం చాలా పదిలంగా గుర్తుపెట్టుకుంటాం. ఒకవేళ ఇవన్నీ ఒకే నెలలో జరిగితే? ఆ నెల మనకు ఎంతో స్పెషల్‌గా ఉండిపోతుంది. జూనియర్ ఎన్టీఆర్‌కు అలాంటి స్పెషల్ నెల మే. ఎందుకంటారా? ఎన్టీఆర్ బర్త్ డే మే 20. అతను హీరోగా నటించిన ఫస్ట్ సినిమా ‘నిన్ను చూడాలని’ మే 25న రిలీజ్ అయింది. లక్ష్మీ ప్రణతిని పరిణయమాడింది కూడా మే నెల్లోనే. వారి పెళ్లి రోజు మే 5. అంతేనా.. అనుకోకండి ఎన్టీఆర్‌కు మరో స్పెషల్ మూమెంట్ కూడా ఈ మేలోనే రాబోతోంది. ఎన్టీఆర్ మరోసారి తండ్రి కాబోతున్నారు. ఆయన భార్య లక్ష్మీప్రణతి డెలివరీ డేట్‌ను మే నెలాఖరున ఇచ్చినట్టు సమాచారం. అంటే అభయ్ రామ్‌కు తమ్ముడో చెల్లో రాబోతున్నారన్నమాట. సో.. ఎన్టీఆర్‌కు మే అంటే సంతోషమే. -
శ్రీవారి సేవలో జూనియర్ ఎన్టీఆర్
తిరుమల: తిరుమల శ్రీవారిని ప్రముఖ సినీ హీరో జూనియర్ ఎన్టీర్ దర్శించుకున్నారు. ఆయన తన సతీమణి లక్ష్మీప్రణతితో కలిసి మంగళవారం తెల్లవారుజామున సుప్రభాత సేవలో పాల్గొన్నారు. ప్రముఖ దర్శకుడు కొరటాల శివ కూడా శ్రీవేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. ప్రస్తుతం.. కె.ఎస్. రవీంద్ర(బాబీ) దర్శకత్వంలో నందమూరి కల్యాణ్‌రామ్ నిర్మిస్తున్న ‘జై లవకుశ’ చిత్రంలో ఎన్టీఆర్ నటిస్తున్నారు.