'ఏపీ మంత్రి మూల్యం చెల్లించక తప్పదు'

'ఏపీ మంత్రి మూల్యం చెల్లించక తప్పదు' - Sakshi


నంద్యాల వ్యవసాయం:  రాష్ట్ర మంత్రి ఆదినారాయణరెడ్డి అహంకారంతో చేసిన వ్యాఖ్యలతో నంద్యాల ఉప ఎన్నికల్లో టీడీపీని ఎస్సీ, ఎస్టీలు  అసహ్యించుకుంటారని అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గ వైఎస్సార్సీపీ సమన్వయకర్త జొన్నలగడ్డ పద్మావతి అన్నారు.గురువారం నంద్యాల పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ మంత్రి హోదాలో ఉండి కనీస పరిజ్ఞానం లేకుండా ఎస్సీలు చదువుకోరని, శుభ్రంగా ఉండరని చెప్పిన మంత్రి,  క్షమాపణలు చెప్పకుండా, అలా అనలేదని తప్పించుకోవడం సిగ్గు చేటరన్నారు. సీఎంకు, మంత్రులకు సలహాదారులుగా ఉన్న ఐఏఎస్‌ ఆఫీసర్లలో ఎస్సీలు కూడా ఉన్నారని గుర్తుంచుకోవాలన్నారు.మంత్రి ఆదినారాయణ రెడ్డి భవిష్యత్‌లో తగిన మూల్యం చెల్లించక తప్పదని పేర్కొన్నారు.  దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ఆర్‌.. ఎస్సీ, ఎస్టీలపైన అభిమానం, ప్రేమానురాగాలు చూపించేవారన్నారు. నంద్యాల  వైఎస్సార్‌సీపీ అభ్యర్థి శిల్పా మోహన్‌రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలి పించి జననేతకు కానుకగా ఇవ్వాలని నంద్యాల ఓటర్లను కోరారు. సమావేశంలో సింగనమల నాయకురాలు బండి లలితా కల్యాణి, బ్యాళ్ల శీను పాల్గొన్నారు.   

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top