'మహంతి ఎక్స్ టెన్షన్'పై కృష్ణారావు మండిపాటు!
రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పీకే మహంతి పదవీ కాలాన్ని పొడిగించినట్టు వస్తున్న వార్తలపై ఐవైఆర్ కృష్ణారావు మండిపడ్డారు.
రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పీకే మహంతి పదవీ కాలాన్ని పొడిగించినట్టు వస్తున్న వార్తలపై ఐవైఆర్ కృష్ణారావు మండిపడ్డారు. ప్రదాన కార్యదర్శిగా మహంతిని కొనసాగించడంపై నిరసన వ్యక్తం చేస్తూ 10 రోజులపాటు సెలవులో వెళ్లినట్టు తెలుస్తోంది. విభజన సమయంలో బయటి వారు ఉంటనే న్యాయం జరుగుతుందన్న వాదనలో అర్థం లేదు అని ప్రధాన కార్యదర్శికి కృష్ణారావు లేఖాస్త్రాన్ని సంధించారు. ఐఏఎస్ లకు ప్రాంతీయత ఆపాదించడంపై లేఖలో ఆయన ఆవేదన వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది.
పదవీకాలం పొడిగింపు అనేది నా దృష్టిలో అద్భుతమైన పనితీరు ఉన్న వారికే ఇవ్వాలని సన్నిహితుల దగ్గర కృష్ణారావు అన్నట్టు సమాచారం. నా దృష్టిలో మహంతికి ఆ స్థాయి లేదని, దినేష్‌రెడ్డి వర్సెస్ ఉమేష్‌కుమార్ కేసులో మహంతి పనితీరును సుప్రీం తప్పుపట్టిందనే విషయాన్ని సన్నిహితుల వద్ద కృష్ణారావు ప్రస్తావించినట్టు తెలుస్తోంది.