ఉభయగోదావరి జిల్లాల్లోని రైతుల ప్రయోజనాలకు గండికొట్టే పట్టిసీమ ఎత్తిపోతల పథకం నిర్మాణాన్ని ఉద్యమాల
తణుకు :ఉభయగోదావరి జిల్లాల్లోని రైతుల ప్రయోజనాలకు గండికొట్టే పట్టిసీమ ఎత్తిపోతల పథకం నిర్మాణాన్ని ఉద్యమాల ద్వారా అడ్డుకుంటామని వైఎస్సార్ సీపీ కేంద్రపాలక మండలి సభ్యుడు, నరసాపురం పార్లమెంటరీ నియోజకవర్గ సమన్వయకర్త వంక రవీంద్రనాథ్ హెచ్చరించారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ పోలవ రం మండలం పట్టిసీమ వద్ద ఎత్తిపోతల పథకం నిర్మించి గోదావరి జలాలను కృష్ణా డెల్టాకు తరలించే ప్రతిపాదనను ప్రభుత్వం తక్షణమే విరమించుకోవాలని డిమాండ్ చేశారు. ఎవరి ప్రయోజనాల కోసం ఈ ప్రాజెక్ట్ నిర్మిస్తున్నారో ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేయాలన్నారు. కేవలం తెలుగుదేశం పార్టీ నాయకుల స్వార్థ ప్రయోజనాల కోస మే ఈ పథకాన్ని తెరపైకి తెచ్చారన్నా రు. ఈ పథకం పేరుతో రూ.1,300 కోట్లను దుర్వినియోగం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఇప్పటికే డెల్టా ప్రాంతంలోని దాదాపు 10 లక్షల ఎకరాలకు రెండో పంటకు సాగునీరు అందే పరిస్థితి లేదని ఆందోళన వ్యక్తం చేశారు.
సీలేరు జలాశయం నుంచి నీటిని తెచ్చుకుంటే తప్ప రెండో పంటకు కొద్దిపాటిగానైనా నీరు అందటం లేదన్నారు. ఉభయగోదావరి జిల్లాలో గోదావరి నదిపై ప్రస్తుతం ఉన్న ఎత్తిపోతల పథకాలకు పూర్తిస్థాయిలో సాగునీరు అందటం లేదన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పట్టిసీమ వద్ద ఎత్తిపోతల పథకం నిర్మిస్తే ఉభయ గోదావరి జిల్లాలోని ప్రజలు, రైతుల జీవన స్థితిగతులు దిగజారిపోతాయని ఆవేదన వ్యక్తం చేశారు. మూడేళ్లలో పోలవరం ప్రాజెక్టును పూర్తిచేస్తామని చెబుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఎత్తిపోతల పథకాన్ని ఎందుకు నిర్మిస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. గోదావరి వరదల సమయంలోనే నీటిని కృష్ణా డెల్టాకు తీసుకు వెళ్తామని చెప్పటం పచ్చి అబద్ధమని పేర్కొన్నారు.
ఈ పథకాన్ని 6 నెలల్లో పూర్తి చేస్తామని చెప్ప టం హాస్యాస్పదమని, పథకానికి అవసరమైన 30 పంపులను తయారు చేసేందుకే కనీసం రెండేళ్లు పడుతుందని వివరించారు. పోలవరం ప్రాజెక్టు కుడి ప్రదాన కాలువ ద్వారా నీటిని తీసుకువెళ్తామని చెబుతున్నారని, ఇంకా 29.25 కిలోమీటర్ల మేర కాలువ పనులు పూర్తికాలేదన్నారు. ఈ పనులు పూర్తి చేయాలంటే 1,776 ఎకరాల భూమిని సేకరించాల్సి ఉం దన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తయితే ఈ పథకం మూలన పడుతుందన్నారు. చంద్రబాబు తన నైజాన్ని పట్టిసీమ పథకం ద్వారా మ రోసారి గుర్తు చేస్తున్నారన్నారు. ఉభయగోదావరి జిల్లాల రైతులు, ప్రజల ప్రయోజనాలను మంట కలిపే ఈ ఎత్తిపోతల పథకం నిర్మాణంపై ప్రభుత్వం వెనక్కి తగ్గకపోతే ఉద్యమాలను తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.