కేజీబీవీ ఎస్‌ఓల భర్తీలో గందరగోళం! | irregularities in KGBV special officers replacement | Sakshi
Sakshi News home page

కేజీబీవీ ఎస్‌ఓల భర్తీలో గందరగోళం!

Dec 19 2013 2:42 AM | Updated on Sep 2 2017 1:45 AM

రాజీవ్ విద్యామిష న్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాల(కేజీబీవీ) ప్రత్యేకాధికారుల పోస్టుల భర్తీ ప్రక్రియ అధికారులకు తలనొప్పిగా మారింది.

విజయనగరం అర్బన్, న్యూస్‌లైన్: రాజీవ్ విద్యామిష న్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కస్తూర్బాగాంధీ బాలిక ల విద్యాలయాల(కేజీబీవీ) ప్రత్యేకాధికారుల పోస్టుల భర్తీ ప్రక్రియ అధికారులకు తలనొప్పిగా మారింది. ప్రస్తుతం ఇన్‌చార్జ్‌లుగా వ్యవహరిస్తున్న వారిలో కొం దరు ఈ విద్యా సంవత్సరం పూర్తయ్యే వరకూ తమనే కొనసాగించాలంటూ కోర్టును ఆశ్రయించారు. దీంతో ఇప్పటికే ఎంపిైకై నియామకాలను పూర్తి చేసుకుని విధుల్లో జాయిన్ అయిన నిరుద్యోగుల్లో ఆందోళన నెలకొంది.

వాస్తవానికి విద్యాహక్కు చట్టంప్రకారం... ఉపాధ్యాయులు కచ్చితంగా బడిలోనే ఉండాలని ఆర్‌వీఎం ఎస్పీడీ ఉషారాణి కొన్ని నిబంధనలు అమలు చేశారు. ఇందులో భాగంగా ఫారెన్ సర్వీసు(సంబంధి త ఇతర శాఖల నుంచి పోస్టును తీసుకోవడం), డె ప్యూటేషన్(సర్దుపాటు)పై కేజీబీవీ స్పెషలాఫీసర్లుగా పనిచేస్తున్న ఉపాధ్యాయులను వెనక్కి పంపేలా చర్య లు తీసుకున్నారు. వారి స్థానాల్లో కాంట్రాక్ట్ పద్ధతిలో ఎస్‌ఓ లను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు ఇటీవల వారికి రాత పరీక్ష నిర్వహించి, నియామాకాలు చేపట్టారు.
 అడ్డుపడుతున్న పాత ఎస్‌ఓలు
 జిల్లాలోని 33 కేజీబీవీలలో 14 రాజీవ్ విద్యామిషన్, 11ఏపీ రెసిడెన్షియల్ సొసైటీ, మిగిలినవి గిరిజన సం క్షేమ శాఖ పరిధిలో పనిచేస్తున్నాయి. ఎంఈఓలు, రెసిడెన్షియల్ సొసైటీ ప్రిన్సిపాళ్లుగా ఉద్యోగ విరమణ చేసిన ఉద్యోగులతో పాటు ఫారిన్ సర్వీసు కింద డి ప్యూటేషన్ కింద పనిచేస్తున్న ప్రభుత్వ ఉపాధ్యాయు లు కొందరు ప్రస్తుతం ఎస్‌ఓలుగా పని చేస్తున్నారు. ఈ స్థానాల్లో కొత్త ఎస్ ఓలను భర్తీ చేసే ప్రక్రియను ఇటీవల పూర్తి చేశారు. అయితే గజపతినగరం, గరి విడి, మెరకముడిదాం కేజీబీవీలలో సోమ, మంగళ వారం విధుల్లో చేరేందుకు కొత్త ఎస్‌ఓలు వెళ్లగా వారి కి చేదు అనుభవం ఎదురైంది. తాము కోర్టుకెళ్లాం... 2014 ఏప్రిల్ వరకు కొనసాగేలా ఉత్తర్వులు తెచ్చుకున్నాం... మీరెలా వస్తారంటూ అక్కడున్న పాత ఎస్‌ఓలు వారిని అడ్డుకున్నారు. దీంతో చేసేదిలేక వారు రాజీవ్ విద్యామిషన్ జిల్లా పీఓను ఆశ్రయించారు.
 ఉత్తర్వుల్లో స్పష్టం చేసిన ఎస్పీడీ
 విద్యా సంవత్సరం మధ్యలో తమను రిలీవ్ చేస్తే ఇబ్బందులు పడతామంటూ కొందరు కోర్టుకెళ్లిన వారికి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాల ని ఎస్పీడీ స్పష్టంగా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఫారెన్ సర్వీసుపై ఎస్‌ఓలుగా వచ్చిన ఉపాధ్యాయులకు 2014 ఏప్రిల్ వరకు ఆయా కేజీబీవీల్లో 9, 10 తరగతులు బోధించేలా చర్యలు తీసుకోవాలని తెలి పారు. స్వచ్ఛందంగా రిలీవ్ కావాలనుకునే వారిని రిలీవ్ చేయాలని సూచించారు. ఇది జీర్ణించుకోని కొందరు పాత ఎస్‌ఓలు ఎలాగైనా కొనసాగాలనే పంథాతో కొత్తవారికి అడ్డు తగులుతున్నారు.
 పాతవాళ్లను టీచర్లగా కొనసాగిస్తాం
 కేజీబీవీలకు ఇన్‌చార్జి ఎస్‌ఓలుగా ఉన్న ఫారెన్ సర్వీ సు మీద వచ్చిన ముగ్గురిని ఆయా విద్యాలయాల్లో 9, 10వ తరగతి ఉపాధ్యాయులుగా కొనసాగిస్తామని రా జీవ్ విద్యామిషన్ పీఓ జి.నాగమణి ‘న్యూస్‌లైన్’కి తె లిపారు.ఎస్‌ఓలుగానే కొనసాగించాలంటూ కొందరు కోర్టుకెళ్లిన విషయాన్ని ఎస్పీడీకి నివేదించామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement