అంతర్‌రాష్ట్ర ‘ఎర్ర’ స్మగ్లర్ అరెస్టు | international redwood smugglers arrested | Sakshi
Sakshi News home page

అంతర్‌రాష్ట్ర ‘ఎర్ర’ స్మగ్లర్ అరెస్టు

Jun 24 2014 3:53 AM | Updated on Sep 2 2017 9:16 AM

అంతర్‌రాష్ట్ర ‘ఎర్ర’ స్మగ్లర్ అరెస్టు

అంతర్‌రాష్ట్ర ‘ఎర్ర’ స్మగ్లర్ అరెస్టు

జిల్లాలో ఎర్రచందనం స్మగ్లర్లను అరెస్టుచేసి వారి ఆటకట్టించేందుకు జిల్లా పోలీసు యంత్రాంగం నడుంబిగించింది.

- పీడీ యాక్టు ప్రయోగం
- రాజమండ్రికి తరలింపు

కడప అర్బన్ : జిల్లాలో ఎర్రచందనం స్మగ్లర్లను అరెస్టుచేసి వారి ఆటకట్టించేందుకు జిల్లా పోలీసు యంత్రాంగం నడుంబిగించింది. అదనపు ఎస్పీ ఆపరేషన్స్ వెంకటరమణ ఆధ్వర్యంలో అంతర్‌రాష్ట్ర ఎర్రచందనం స్మగ్లర్ ఖాదర్‌వలీ అలియాస్ నందలూరు బాషా ను పీడీ యాక్టు కింద సోమవారం నందలూరు శివార్లలోని ఆల్విన్ కర్మాగారం వద్ద అరెస్టు చే శారు. సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఏఎస్పీ ఆపరేషన్స్ వెంకటరమణ మాట్లాడుతూ కలెక్టర్ కోన శశిధర్ ఇచ్చిన డిటెన్షన్ ఆదేశాల ద్వారా ఖాదర్‌వలీని రాజమండ్రి సెంట్రల్‌జైలుకు తరలిస్తున్నామన్నారు. ఖా దర్‌వలీ స్వగ్రామం నందలూరు అన్నారు.

ఇతను తన సహచరులతో కలిసి రాజం పేట, కోడూరు, బద్వేలు పరిసర ప్రాంతాల్లోని రిజర్వ్ ఫారెస్టులోని విలువైన ఎర్రచందనం చెట్లను నరికి వాటిని దుంగలుగా మార్చి వాహనాల ద్వారా తరలించేవాడన్నారు. జిల్లా కర్నాటక రాష్ట్రంలోని కాడేగానహల్లికిచెందిన అంతర్‌రాష్ట్ర స్మగ్లర్ షబ్బీ ర్, మరి కొందరికీ ఎర్రచందనం దుంగలను విక్రయిస్తూ అక్రమంగా డబ్బు సంపాదించేవాడన్నారు. పరిసర గ్రామాల్లోని యు వతను కూడా స్మగ్లింగ్‌వైపు తిప్పుకొని ము ఠా ఏర్పరచుకున్నారన్నారు. ఖాదర్‌వలీ గ తంలో మూడు పర్యాయాలు అరెస్టు కాబడి బెయిల్‌పై బయటకు వచ్చిన తర్వాత కూడా ప్రవర్తన మార్చుకోలేదన్నారు.
 
ప్రత్యేక బృందానికి ప్రశంసలు
ఎర్రచందనాన్ని జిల్లా నుంచి కర్నాటక రాష్ట్రం కాటెగానహల్లికి అక్రమ రవాణా చేస్తూ కేసుల్లో నిందితుడిగా ఉండి పోలీసులకు దొరక్కుండా పరారీలో ఉన్న అంతర్‌రాష్ట్ర స్మగ్లర్ ఖాదర్‌వలీ అలియాస్ నందలూరు బాషను అరెస్టు చేసిన ప్రత్యేక బృందం రాజంపేట డిఎస్పీ జివి రమణ, ఒంటిమిట్ట సీఐ రెడ్డప్ప, నందలూరు ఎస్‌ఐ కృష్ణయ్యతోపాటు సిబ్బందిని అదనపు ఎస్పీ ఆపరేషన్స్ ఎ.వెంకటరమణ అభినందించారు. రివార్డుల కోసం జిల్లా ఎస్పీకి సిఫారసు చేస్తామని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement