అంతర్జాతీయ ఎర్రచందనం స్మగ్లర్ అరెస్ట్ | international red sandalwood smuggler dawood jakir arrested in ysr district | Sakshi
Sakshi News home page

అంతర్జాతీయ ఎర్రచందనం స్మగ్లర్ అరెస్ట్

Aug 20 2016 6:38 PM | Updated on Sep 4 2017 10:06 AM

అంతర్జాతీయ ఎర్రచందనం స్మగ్లర్ అరెస్ట్

అంతర్జాతీయ ఎర్రచందనం స్మగ్లర్ అరెస్ట్

అంతర్జాతీయ ఎర్రచందనం స్మగ్లర్‌ దావుద్ జాకీర్ను పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు.

కర్నూలు: అంతర్జాతీయ ఎర్రచందనం స్మగ్లర్‌ను వైఎస్సార్ జిల్లా పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. చైనాకు చెందిన దావుద్ జాకీర్ ఎర్రచందనం స్మగ్లింగ్ దందా నడుపుతున్నాడని రాయలసీమ ఐజీ శ్రీధర్ రావు తెలిపారు.

కర్నూలులో ఆయన విలేకరులతో మాట్లాడుతూ... స్థానిక ఫిరోజ్ దస్తగీర్‌తో కలిసి విలువైన ఎర్రచందనం దుంగలను దేశ సరిహద్దులు దాటిస్తున్నాడన్నారు. గత కొంత కాలంగా జాకీర్పై రాయలసీమ వ్యాప్తంగా పలు కేసులు నమోదయ్యాయని చెప్పారు. దీంతో నిఘా పెంచిన పోలీసులు ఈ ఇద్దరినీ శనివారం అదుపులోకి తీసుకున్నామన్నారు. వారి వద్ద నుంచి 5.8 టన్నుల ఎర్రచందనం దుంగలు, ఓ లారీ, ఓ ఐచర్ వాహనం, రెండు కార్లు, రెండు సెల్‌ఫోన్లు, రూ. 10 వేల నగదును స్వాధీనం చేసుకున్నట్లు ఐజీ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement