ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్యాయత్నం | Inter Student attempts suicide in Guntur | Sakshi
Sakshi News home page

ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్యాయత్నం

Sep 30 2013 9:36 AM | Updated on Aug 24 2018 2:33 PM

కతాయిల వేధింపులు తట్టుకోలేక ఓ విద్యార్థిని ఆత్మహత్యాయత్నం చేసింది. అసభ్యకరంగా మాట్లాడటం, శరీంపై చేతులు వేయడమే కాకుండా తన తండ్రిని గాయపరచడాన్ని ఆమె తట్టుకోలేకపోయింది.

గుంటూరు : ఆకతాయిల వేధింపులు తట్టుకోలేక ఓ విద్యార్థిని ఆత్మహత్యాయత్నం చేసింది. అసభ్యకరంగా మాట్లాడటం, శరీంపై చేతులు వేయడమే కాకుండా తన తండ్రిని గాయపరచడాన్ని ఆమె తట్టుకోలేకపోయింది. విషయం ఎవరికైనా చెబితే కుటుంబసభ్యులను చంపేస్తామని బెదరించటంతో ఇక చావే దిక్కనుకుంది. పోలీసుల కథనం ప్రకారం.....నగరంలోని వల్లూరువారితోటకు చెందిన ఓ విద్యార్థిని అమరావతి రోడ్డులోని కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతోంది.

తల్లిదండ్రులు కూలీలు. అదే వీధిలో ఉంటున్న మానుకొండ సాయి (20), మస్తాన్ వలి (21)  నెలరోజులుగా ఆమె కళాశాలకు వెళ్లేటప్పుడు, తిరిగి వచ్చేటప్పుడు వెంబడించి దుర్భాషలాడుతూ, శరీంపై చేతు వేస్తూ వేధిస్తున్నారు. ఈ విషయాన్ని ఆమె తండ్రికి చెప్పడంతో ఆయన ....యువకుల ఇంటికి వెళ్లి పద్ధతి మార్చుకోకపోతే పోలీసులకు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించాడు.

దాంతో రెచ్చిపోయిన యువకులు శుక్రవారం మద్యం సేవించి ఎవరూలేని సమయంలో ఆ విద్యార్థిని ఇంటికి వెళ్లి లైంగిక దాడికి యత్నించారు. విషయం తెలుసుకున్న ఆమె తండ్రి శనివారం వారిని మళ్లీ హెచ్చరించగా ఆయన్ని కొట్టి గాయపరిచారు. తండ్రికి జరిగిన పరాభవాన్ని జీర్ణించుకోలేని ఆమె శరీరంపై కిరోసిన్ పోసుకుని నిప్పు అంటించుకుంది.

అయితే మంటలకు తాళలేక కేకలు వేయటంతో ఇరుగుపొరుగు వారు మంటలను ఆర్పి తల్లిదండ్రులకు సమాచారం అందించారు. వారు కుమార్తెను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా, శరీరం 60 శాతం కాలిందని, ఆమె పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. బాధితురాలి తండ్రి ఫిర్యాదు మేరకు అరండల్ పేట ఎస్.ఐ వసంతరావు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement