ఇంటర్మీడియెట్ ప్రథమ సంవత్సరం అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ ఫలితాలు బుధవారం విడుదల అయ్యాయి.
హైదరాబాద్ : ఇంటర్మీడియెట్ ప్రథమ సంవత్సరం అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ ఫలితాలు బుధవారం విడుదల అయ్యాయి.ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ఈరోజు ఉదయం 11 గంటలకు ఫలితాలను విడుదల చేశారు. బాలికలు 74.81 శాతంతో, బాలురు 70.93 శాతం ఉత్తీర్ణత నమోదు చేశారు. ఇక ఆంధ్రప్రదేశ్లో 72.73, తెలంగాణలో 65.82 శాతం విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. అలాగే ఒకేషనల్ కోర్సుల్లో ఆంధ్రప్రదేశ్లో 56.9 శాతం, తెలంగాణలో 55.84 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు.