దేశంలో ఉగ్రవాదుల దాడుల హెచ్చరికల నేపథ్యంలో సోమవారం ఇంటెలిజెన్స్ బృందం నాగార్జునసాగర్ డ్యాం ను సందర్శించింది.
నాగార్జునసాగర్: దేశంలో ఉగ్రవాదుల దాడుల హెచ్చరికల నేపథ్యంలో సోమవారం ఇంటెలిజెన్స్ బృందం నాగార్జునసాగర్ డ్యాం ను సందర్శించింది. బృందం సభ్యులు మొదట గార్డ్‌రూములు, కాపలా ఉండే గార్డుల సంఖ్యను, సీసీ కెమెరాల పనితీరును అడిగి తెలుసుకున్నారు. డ్యాం భద్రతపై ఆరా తీశారు. గ్యాలరీలలోకి దిగి ఆయాప్రాంతాలను సందర్శించారు. ఎస్‌పీఎఫ్ సిబ్బందికి కావాల్సిన భద్రత సామగ్రిని, గార్డుల సంఖ్యను పెంచాలని ప్రాజెక్టు అధికారులకు సూచించినట్లు తెలిసింది. సందర్శించిన వారిలో ఇంటెలిజెన్స్ డీఎస్పీ లక్ష్మినారాయణరెడ్డి బృందం వెంట డ్యాం ఈఈ విష్ణుప్రసాద్, ఎస్‌పీఎఫ్ అధికారులు ఉన్నారు.