చెట్టుఎక్కి మతిస్థిమితం​ లేని మహిళ హల్‌చల్‌

Insane Woman Climbs Tree And Creates Ruckus - Sakshi

సాక్షి, విజయవాడ: మతిస్థిమితం లేని ఓ మహిళ చెట్టుఎక్కి ఆత్మహత్య చేసుకుంటానంటూ అందరికి ముచ్చెమటలు పట్టించిన ఘటన మంగళవారం నగరంలోని కాందారీ రోడ్‌లో చోటు చేసుకొంది. చెట్టు దిగమని స్థానికులు ఎంత చెప్పినా పట్టించుకోకపోగా.. దూకేస్తానని మహిళ బెదిరించడంతో వారు పోలీసులకు సమాచారమిచ్చారు. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగింది. చెట్టుకు నిచ్చెన వేసి అతి కష్టం మీద మహిళను కిందకు దించారు. అనంతరం ఆమెను ఆసుపత్రికి తరలించారు. చెట్టు ఎక్కే క్రమంలో సదరు మహిళకు చిన్న చిన్న గాయాలు అయ్యాయని, ఆమెకు మతిస్థిమితం లేనట్టు గుర్తించామని పోలీసులు పేర్కొన్నారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top