పిఠాపురంలో చిరువ్యాపారిపై పోలీసుల దాష్టీకం | Innocent people harassed by Police Brutality at pithapuram | Sakshi
Sakshi News home page

పిఠాపురంలో చిరువ్యాపారిపై పోలీసుల దాష్టీకం

Dec 22 2013 12:33 PM | Updated on Aug 21 2018 6:21 PM

తూర్పుగోదావరి పిఠాపురంలో పోలీసులు దాష్టీకానికి ఒడిగట్టారు. ఇటీవల ఓ హత్య చోటు చేసుకుంది.

తూర్పుగోదావరి పిఠాపురంలో పోలీసులు దాష్టీకానికి ఒడిగట్టారు. ఇటీవల ఓ హత్య చోటు చేసుకుంది. ఆ హత్య కేసులో పిఠాపురానికి చెందిన చిరువ్యాపారి శ్రీనివాస్కి సంబంధం ఉందని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. అయితే ఆ హత్య కేసుకు తనకు ఎటువంటి సంబంధం లేదని శ్రీనివాస్ పోలీసులకు తెలిపాడు. అయిన ఆ కేసులో శ్రీనివాస్కు ప్రమేయం ఉందని పోలీసులు అనుమానం వ్యక్తం చేసి, అతన్ని అదుపులోకి తీసుకున్నారు.

 

అనంతరం అతడిని స్టేషన్కు తీసుకువెళ్లి విచారణ పేరుతో చితకబాదారు. దీంతో అతడు తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో అతడిని వైద్య చికిత్స కోసం కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. శ్రీనివాస్కు ఆ హత్యతో ప్రమేయం లేదని ఎంత వాదించిన స్టేషన్కు తీసుకువెళ్లారని అతడి కుటుంబ సభ్యులు ఆరోపించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement