సౌదీలో భారతీయుడి మృతి | indian died in saudi arabia | Sakshi
Sakshi News home page

సౌదీలో భారతీయుడి మృతి

Mar 24 2015 3:04 PM | Updated on Sep 2 2017 11:19 PM

పొట్టకూటి కోసం సౌదీ అరేబియాకు వెళ్లిన ఓ భారతీయుడు గుండెపోటుతో మృతిచెందాడు.

ప్రొద్దుటూరు : పొట్టకూటి కోసం సౌదీ అరేబియాకు వెళ్లిన ఓ భారతీయుడు గుండెపోటుతో మృతిచెందాడు. వివరాల్లోకి వెళ్తే... వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన ఆజాద్(43) అనే వ్యక్తి రెండు సంవత్సరాల క్రిందట సౌదీ వెళ్లాడు. అయితే హఠాత్తుగా గుండెపోటు రావడంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు మంగళవారం అతని కుటుంబ సభ్యులకు సమాచారం అందింది. బతుకు తెరువు కోసం విదేశాలకు వెళ్లిన తమ కుమారుడు అక్కడ మరణిస్తే.. చివరి చూపు కోసం ఇక్కడికి తీసుకురావడానికి కూడా తమ వద్ద డబ్బులు లేవని అతని తల్లి దండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు.
సౌదీ అరేబియా నుండి మృతదేహాన్ని స్వస్థలానికి తరలించడానికి సుమారు రూ.3 లక్షల దాకా ఖర్చు అవుతుందని, అంత స్థోమత తమకు లేదని,  ప్రభుత్వమే సాయం చేయాలని వేడుకుంటున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement