సంస్కృతికి వారసులుగా పిల్లల్ని పెంచండి | Increase the heirs of the culture of children | Sakshi
Sakshi News home page

సంస్కృతికి వారసులుగా పిల్లల్ని పెంచండి

Nov 30 2014 1:46 AM | Updated on Sep 2 2017 5:21 PM

సంస్కృతికి వారసులుగా పిల్లల్ని పెంచండి

సంస్కృతికి వారసులుగా పిల్లల్ని పెంచండి

పిల్లలను భారతీయ సంస్కృతి, సంప్రదాయాలకు వారసులుగా పెంచాలని ప్రముఖ రచయిత, సినీనటుడు గొల్లపూడి మారుతీరావు తల్లిదండ్రులకు సూచిం చారు.

  • ప్రముఖ నటుడు గొల్లపూడి మారుతీరావు
  • రాజమండ్రి: పిల్లలను భారతీయ సంస్కృతి, సంప్రదాయాలకు వారసులుగా పెంచాలని ప్రముఖ రచయిత, సినీనటుడు గొల్లపూడి మారుతీరావు తల్లిదండ్రులకు సూచిం చారు. రాజమండ్రిలోని శ్రీ షిర్డీసాయి విద్యానికేతన్, డ్యాఫ్నీ ఏసియాటిక్ పాఠశాలల ఆధ్వర్యంలో శనివారం స్థానిక ఎస్వీ ఫంక్షన్ హాలులో జరిగిన తల్లుల సదస్సులో ఆయన మాట్లాడారు.

    విదేశీ విద్యను బలవంతంగా అంటగడుతూ పిల్లలను సంస్కృతికి దూరం చేస్తున్నారని గొల్లపూడి ఆవేదన వ్యక్తం చేశారు. ప్రముఖ  వైద్యుడు డాక్టర్ రాధాకృష్ణ, డాక్టర్ విష్ణుప్రియ, ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణుడు దారపు నాగిరెడ్డి, స్కూలు కరస్పాండెంట్ తంబాబత్తుల శ్రీధర్, ప్రిన్సిపాల్ శ్రీవిద్య పాల్గొన్నారు.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement