వ్యక్తిగత నైపుణ్యం పెంచుకోవాలి | Increase personal skill | Sakshi
Sakshi News home page

వ్యక్తిగత నైపుణ్యం పెంచుకోవాలి

Sep 30 2014 2:51 AM | Updated on Sep 2 2017 2:07 PM

వ్యక్తిగత నైపుణ్యం పెంచుకోవాలి

వ్యక్తిగత నైపుణ్యం పెంచుకోవాలి

నెల్లూరు (పొగతోట) : కలెక్టర్, జేసీ, ఇతర ఉద్యోగులకు ప్రభుత్వం ప్రతి నెల ఎందుకు జీతాలు ఇస్తోంది.

కలెక్టర్ ఎన్. శ్రీకాంత్
 నెల్లూరు (పొగతోట) : కలెక్టర్, జేసీ, ఇతర ఉద్యోగులకు ప్రభుత్వం ప్రతి నెల ఎందుకు జీతాలు ఇస్తోంది. వేలకు వేలు జీతాలు తీసుకుంటున్నందుకు అందుకు తగిన విధంగా న్యాయం చేస్తున్నామా లేదా అనేది ప్రశ్నించుకోవాలని కలెక్టర్ ఎన్.శ్రీకాంత్ ఉద్యోగులకు సూచించారు. సోమవారం కలెక్టరేట్‌లోని గ్రీవెన్స్ హాలులో 14 మందికి కారుణ్య నియమకాలు, 11 మంది వికలాంగులకు ఉద్యోగ నియామక పత్రా లు కలెక్టర్ అందజేశారు. ఈ సందర్భంగా బి సెక్షన్ సూపరింటెండెంట్ రాంప్రసాద్‌ను మీ వ్యక్తిగత స్కిల్ ఏమిటని కలెక్టర్ ప్రశ్నించారు. వినతిపత్రం ఇవ్వడానికి వచ్చిన వెంగయ్య అనే రైతు సమస్యను తెలుసుకుని కలెక్టర్‌కు వివరించారు. మీరు చేసిందేమిటీ ఆయన చెప్పిన దానికి మరికొంత జోడించి వివరించారు. ఇదేనా మీరు చేసిందని ప్రశ్నించారు. కలెక్టర్ మాట్లాడుతూ ప్రధాన మంత్రి నుంచి ముఖ్యమంత్రి వరకు వారికి ప్రత్యేక స్కిల్స్ ఉన్నాయన్నారు. వాటి ద్వారా వారు రాణిస్తున్నారన్నారు. ప్రభుత్వ ఉద్యోగుల్లో ప్రతి ఒక్కరికి తప్పకుండా ప్రత్యేక స్కిల్స్ ఉండాలన్నారు. కంప్యూటర్, టైపింగ్ తదితర వాటిపై ప్రతి ఒక్కరికి అవగాహన ఉండాలన్నారు. నూతనంగా ఉద్యోగ బాధ్యతలు స్వీకరిస్తున్న వారికి వ్యక్తిగత నైపుణ్యంపై ప్రత్యేక శిక్షణ ఇవ్వాలన్నారు. ఉద్యోగులకు శిక్షణ పూ ర్తయిన తరువాత వారి వారి స్కిల్స్‌ను తన ఎదుట ప్రదర్శించాలన్నారు. ప్రభుత్వ ఉద్యోగులందరూ వ్యక్తిగత నైపుణ్యం పెంచుకోవానలి సూచించారు. వారం రోజుల తరువాత ఉద్యోగులందరి వ్యక్తిగత స్కిల్స్‌ను పరిశీలిస్తామన్నారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ జి. రేఖారాణి, ఏజేసీ రాజ్‌కుమార్, డీఆర్‌ఓ నాగేశ్వరరావు పాల్గొన్నారు.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement