breaking news
n. srikanth
-
ఉడాలో నిపుణులు లేరు
అతి కొద్దిమందే సీఆర్డీఏలోకి.. నోటిఫికేషన్ తర్వాత భూసమీకరణ ‘సాక్షి’తో సీఆర్డీఏ {పత్యేక కమిషనర్ శ్రీకాంత్ విజయవాడ బ్యూరో : వీజీటీఎం ఉడాలో ప్రస్తుతం పనిచేస్తున్న వారిలో నైపుణ్యం ఉన్నవారు కనిపించడంలేదని క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ(సీఆర్డీఏ) ప్రత్యేక కమిషనర్ ఎన్.శ్రీకాంత్ చెప్పారు. అయినా ఉన్నవారిలో బాగా పనిచేసే కొందరిని సీఆర్డీఏలోకి తీసుకుంటామని తెలిపారు. సీఆర్డీఏ బిల్లుకు అసెంబ్లీలో ఆమోదం లభించిన తర్వాత ఉడాకు వచ్చిన ఆయన శుక్రవారం ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. రాజధానిని అంతర్జాతీయ స్థాయిలో నిర్మించడానికి ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోందని, ఇందుకు అనుగుణంగా అత్యంత నైపుణ్యం గలవారి అవసరం ఉందని తెలిపారు. ఆ స్థాయిలో పనిచేసే వారిని గుర్తిస్తున్నామని, త్వరలో ఆ బృందం తయారవుతుందన్నారు. ఉడాలో పనిచేస్తున్న వారిలో అవినీతి ఆరోపణలు, రాజకీయ పలుకుబడి లేనివారి గురించి తెలుసుకుంటున్నామని, అందరితో చర్చించి సీఆర్డీఏలోకి తీసుకుంటామన్నారు. మిగిలిన వారి విషయంలో నిర్ణయం ప్రభుత్వానిదే.. సీఆర్డీఏకు తీసుకోగా, మిగిలిన వారిని ఎక్కడ పని చేయించాలనేది ప్రభుత్వం నిర్ణయిస్తుందని శ్రీకాంత్ చెప్పారు. గతంలో ఇక్కడ పనిచేసిన వారికి, సీఆర్డీఏ ఏర్పాటు తర్వాత వేరేచోటకు వెళ్లే వారికి పెన్షన్, ఇతర సౌకర్యాలు ఇక్కడి నుంచి లభిస్తాయని తెలిపారు. కొత్త రాజ ధానిలో సీఆర్డీఏ కార్యాలయం ఏర్పాటుకు చాలా సమయం పడుతుందని, అప్పటివరకూ ఉడా కార్యాలయాన్నే సీఆర్డీఏ కార్యాలయంగా వినియోగిస్తామని చెప్పారు. భూసమీకరణ సిబ్బంది, అధికారులంతా గుంటూరు కేంద్రంగా పనిచేస్తారని తెలి పారు. ఎంపికైన సిబ్బందికి, వచ్చే నెల 19 నుంచి సీఆర్డీఏ సిబ్బంది 30 మందికి వారం రోజులపాటు సింగపూర్ ప్రభుత్వ సంస్థ ద్వారా శిక్షణ ఉంటుందన్నారు. రైతుల మనోభావాలకు అనుగుణంగానే భూ సమీకరణ ఉంటుందని, వారి కోసమే ఇంత కష్టపడుతున్నామని చెప్పారు. సీఆర్డీఏ నోటిఫికేషన్ వెలువడిన తర్వాత నుంచి పని ప్రారంభిస్తామని, ఇప్పటికే ఉన్న వారికి సామర్థ్యాన్ని బట్టి వివిధ రకాల పనులు అప్పగించామని చెప్పారు. అందరి సలహాలు, సూచనలతో ముందుకువెళతామని, అత్యుత్తమ రాజధాని నిర్మాణమే అందరి లక్ష్యమని ఆయన వివరించారు. -
వ్యక్తిగత నైపుణ్యం పెంచుకోవాలి
కలెక్టర్ ఎన్. శ్రీకాంత్ నెల్లూరు (పొగతోట) : కలెక్టర్, జేసీ, ఇతర ఉద్యోగులకు ప్రభుత్వం ప్రతి నెల ఎందుకు జీతాలు ఇస్తోంది. వేలకు వేలు జీతాలు తీసుకుంటున్నందుకు అందుకు తగిన విధంగా న్యాయం చేస్తున్నామా లేదా అనేది ప్రశ్నించుకోవాలని కలెక్టర్ ఎన్.శ్రీకాంత్ ఉద్యోగులకు సూచించారు. సోమవారం కలెక్టరేట్లోని గ్రీవెన్స్ హాలులో 14 మందికి కారుణ్య నియమకాలు, 11 మంది వికలాంగులకు ఉద్యోగ నియామక పత్రా లు కలెక్టర్ అందజేశారు. ఈ సందర్భంగా బి సెక్షన్ సూపరింటెండెంట్ రాంప్రసాద్‌ను మీ వ్యక్తిగత స్కిల్ ఏమిటని కలెక్టర్ ప్రశ్నించారు. వినతిపత్రం ఇవ్వడానికి వచ్చిన వెంగయ్య అనే రైతు సమస్యను తెలుసుకుని కలెక్టర్‌కు వివరించారు. మీరు చేసిందేమిటీ ఆయన చెప్పిన దానికి మరికొంత జోడించి వివరించారు. ఇదేనా మీరు చేసిందని ప్రశ్నించారు. కలెక్టర్ మాట్లాడుతూ ప్రధాన మంత్రి నుంచి ముఖ్యమంత్రి వరకు వారికి ప్రత్యేక స్కిల్స్ ఉన్నాయన్నారు. వాటి ద్వారా వారు రాణిస్తున్నారన్నారు. ప్రభుత్వ ఉద్యోగుల్లో ప్రతి ఒక్కరికి తప్పకుండా ప్రత్యేక స్కిల్స్ ఉండాలన్నారు. కంప్యూటర్, టైపింగ్ తదితర వాటిపై ప్రతి ఒక్కరికి అవగాహన ఉండాలన్నారు. నూతనంగా ఉద్యోగ బాధ్యతలు స్వీకరిస్తున్న వారికి వ్యక్తిగత నైపుణ్యంపై ప్రత్యేక శిక్షణ ఇవ్వాలన్నారు. ఉద్యోగులకు శిక్షణ పూ ర్తయిన తరువాత వారి వారి స్కిల్స్‌ను తన ఎదుట ప్రదర్శించాలన్నారు. ప్రభుత్వ ఉద్యోగులందరూ వ్యక్తిగత నైపుణ్యం పెంచుకోవానలి సూచించారు. వారం రోజుల తరువాత ఉద్యోగులందరి వ్యక్తిగత స్కిల్స్‌ను పరిశీలిస్తామన్నారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ జి. రేఖారాణి, ఏజేసీ రాజ్‌కుమార్, డీఆర్ఓ నాగేశ్వరరావు పాల్గొన్నారు. -
‘కోడ్’ కూసింది
నెల్లూరు: ‘మున్సిపల్ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల కావడంతోనే సోమవారం నుంచి జిల్లా అంతా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఉన్నా చట్ట పరంగా వారికి ప్రభుత్వ కార్యక్రమాలకు ఎలాంటి ఆహ్వానం పంపరాదు. అధికారులు నాయకుల వెంట కలసి ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొంటే వేటు వేస్తాం’ అని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ఎన్. శ్రీకాంత్ హెచ్చరించారు. మున్సిపల్ ఎన్నికల ఏర్పాట్లలో నిమగ్నమైన ఆయన సోమవారం రాత్రి సాక్షి ప్రతినిధికి ఇంటర్వ్యూ ఇచ్చారు. జిల్లాలో నెల్లూరు కార్పొరేషన్, నాయుడుపేట నగర పంచాయతీ, ఆత్మకూరు, గూడూరు, సూళ్లూరుపేట, వెంకటగిరి, కావలి మున్సిపాలిటీల్లో 661 పో లింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయనున్నట్టు చె ప్పారు. పోలింగ్‌కు 700 ఈవీఎంలు అవసరంగా కాగా, 66 ఈవీఎంలు తక్కువ రావడంతో వాటిని తెప్పించేందుకు ఎన్నికల సంఘాన్ని సంప్రదించామన్నారు. ఎన్నికలకు 3వేల మంది సిబ్బందిని సన్నద్ధం చేశామన్నారు. ఎన్నికల్లో డబ్బు, మద్యం పోరుపై స్పష్టత ఆనం విజయకుమార్‌రెడ్డిని బరిలోకి దించబోతున్నారు. సోమవారం నిర్వహించిన జిల్లా కాంగ్రెస్ కమిటీ సమావేశంలో వివేకా ఈ విషయాన్ని ప్రకటించారు. ఇకపోతే ఈ సారి సర్వేపల్లి నుంచి కాకుండా రూరల్ నియోజక వర్గం నుంచి పోటీ చేయాలని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి మానసికంగా సిద్ధపడ్డారు. ఇందులో భాగంగానే ఆయన గత మూడు రోజులుగా నెల్లూరు రూరల్ నియోజక వర్గ పర్యటనలకు వెళుతున్నారు. ఆదివారం జరిగిన ఒక కార్యక్రమంలో సోమిరెడ్డి తానీసారి రూరల్ నుంచే పోటీకి దిగబోతున్నానని చెప్పకనే చె ప్పారు. దీంతో నెల్లూరు రూరల్ నుంచి టీడీపీ అభ్యర్థిగా సోమిరెడ్డి చ ంద్రమోహన్రెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థిగా ఆనం విజయకుమార్‌రెడ్డి పోటీ చేస్తారనేది తేలిపోయింది. ఇక సిటీ విషయానికి వస్తే డాక్టర్ అనిల్‌కుమార్ యాదవ్ వైఎస్సార్ కాంగ్రెస్ సమన్వయ కర్తగా వ్యవహరిస్తున్నారు. ఇక్కడ గతంలో పీఆర్పీ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందిన ముంగమూరు శ్రీధరకృష్ణారెడ్డి వచ్చే ఎన్నికల్లో సైకిల్ గుర్తు మీద పోటీ చేయబోతున్నారు. రూరల్ ఎమ్మెల్యే వివేకానందరెడ్డి ఇక్కడి నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా తన మిత్రుడు శ్రీధరకృష్ణారెడ్డితో తలపడనున్నారు. దీంతో ఈ నియోజక వర్గానికి సంబంధించిన ప్రధాన పార్టీల అభ్యర్థుల విషయంలో స్పష్టత వచ్చింది. ‘కోడ్’ కూసింది పంపిణీని నియంత్రించడం, వాటి రవాణాను అరికట్టడం కోసం పోలీసు సిబ్బందితో ప్రత్యేకంగా చెక్ పోస్టులు ఏర్పాటు చేస్తామన్నారు. డబ్బు, మద్యం అక్రమ పంపిణీ, రవాణా మీద నిఘా వేయడానికి అధికారులతో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేయనున్నట్టు కలెక్టర్ వివరించారు. ఎన్నికలు జరుగుతున్న కార్పొరేషన్, మున్సిపాలిటీల్లో ప్రజల నుంచి సమాచారం, ఫిర్యాదుల కోసం 24 గంటలు పనిచేసేలా కాల్ సెంటర్లు ఏర్పాటు చేస్తామన్నారు. మంగళవారం సాయంత్రానికి ఇవి పనిచేసే ఏర్పాట్లు చేస్తున్నట్టు కలెక్టర్ చెప్పారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘన, ఇతర అంశాలకు సంబంధించి ప్రజలెవరైనా ఈ కాల్ సెంటర్లకు ఫిర్యాదు చేయవచ్చన్నారు. రాష్ట్ర శాసనసభ సుప్త చేతనావస్థలో ఉన్నందువల్ల మంత్రులు లేరని, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఉన్నా వారికి ఎలాంటి అధికారాలు ఉండవని కలెక్టర్ స్పష్టం చేశారు. అధికారులెవరూ వీరిని అధికారిక కార్యక్రమాలు ఆహ్వానించరాదని, వారు పిలిస్తే కార్యక్రమాలకు హాజరు కాకూడదని ఆయన స్పష్టం చేశారు. ఇందుకు విరుద్ధంగా వ్యవహరించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎన్నికల ఏర్పాట్లకు సంబంధించిన అన్ని అంశాలను సమీక్షించడం కోసం ఈనెల 7వ తేదీ జిల్లాలోని అధికారులందరితో సమావేశం ఏర్పాటు చేశామన్నారు. ఎన్నికలు జరుగుతున్న పట్టణాల్లో రాజకీయ పార్టీల హోర్డింగులు, ఫ్లెక్స్‌లు ఉండరాదన్నారు. వీటిని తొలగించాలని అధికారులకు ఇప్పటికే ఆదేశాలు జారీ చేసినట్టు చెప్పారు. ఎన్నికల అధికారుల అనుమతి తీసుకుని జరిపే ప్రచారానికి సంబంధించిన ఖర్చు ఆయా రాజకీయ పార్టీల ఖాతాలోకి జమ చేస్తామన్నారు. నామినేషన్ల పర్వం ముగిశాక జరిగే ప్రచారానికి సంబంధించిన ఖర్చు అభ్యర్థుల ఖాతాలోకి వెళుతుందని కలెక్టర్ చెప్పారు. ఎన్నికల్లో ఓటర్లు డబ్బు, మద్యం తీసుకోవడం ప్రజాస్వామ్యానికి వ్యతిరేకమన్నారు. దీని గురించి ప్రజల్లో అవగాహన కల్పించడం కోసం అన్ని మున్సిపాలిటీల స్థాయిలో 7వ తేదీ నుంచి తహశీల్దార్ల ఆధ్వర్యంలో చైతన్య కార్యక్రమాల నిర్వహణకు ప్రణాళిక తయారు చేసినట్టు కలెక్టర్ శ్రీకాంత్ వెల్లడించారు. ఎన్నికలు నిష్పక్షపాతంగా, నిజాయితీగా నిర్వహించేందుకు రాజకీయ పార్టీలు, ప్రజలు సహకరించాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. నగరంలో ఆదివారం దీపం పథకం కింద సిలిండర్లు, ఇతర పథకాలకు సంబంధించిన ఆస్తుల పంపిణీపై వచ్చిన ఫిర్యాదులపై విచారించి తగిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ చెప్పారు.