ఎడతెరిపిలేని వర్షాలు.. స్కూళ్లకు సెలవు

Incessant Rains In Andhra Pradesh: Raised Transport Problem - Sakshi

సాక్షి, విశాఖపట్నం : మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున​ వర్షాలకు లోతట్టు ప్రాంతాలన్ని జలమయమయ్యాయి. పశ్చిమ మధ్య బంగాళాఖాతానికి అనుకొని నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. ఈ అల్పపీడనం వాయుగుండంగా మారుతుండటంతో ఈ రోజు రాత్రి వరకు విశాఖపట్నం, తూర్పుగోదావరి తీరం దాటే సూచనలు కనిపిస్తున్నాయని రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ వెల్లడించింది. దీంతో రానున్న 24 గంటల్లో ఉత్తరాంధ్ర, తూర్పుగోదావరి జిల్లాలో పెను గాలులతో కూడిన భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని తెలిపింది. తీరం వెంబడి 45-50 కి.మీ వేగంతో ఈదురు గాలులు వీస్తుండంటో మత్స్యకారులను వేటకు వెళ్లొద్దని వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది.

పాఠశాలలకు సెలవు
జ్ఞానాపురంలో లోతట్టు ప్రాంతాలలోకి భారీగా వరదనీరు చేరడంతో పాదచారులు, వాహనదారులు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కుంటున్నారు. నక్కలపల్లి మండలం దేవవరంలో చెరకు, పత్తి, వరి పోలాలు నీట మునిగాయి. అనకాపల్లిలోని రెండు రోజులుగా వర్షాలు కురుస్తుండటంతో ఆర్టీసీ కాంప్లెక్స్ లోకి వర్షపు నీరు చేరడంతో నీటి మునిగింది. ఈ నేపథ్యంలో విశాఖ జిల్లా కలెక్టర్‌ అధికారులతో టెలీ కాన్ఫరెన్స్‌ నిర్వహించి అధికారులను, ప్రజలను అప్రమత్తంగా ఉండాలని సూచించారు. జిల్లాలోని పాఠశాలలకు సెలవు ప్రకటించారు. దేవరాపల్లి దైవాడ రిజర్వాయర్‌కు భారీగా వరద నీరు చేరుతుండటంతో నీటిమట్టం ప్రమాద యికి చేరుకుంది. దీంతో అధికారులు ఒక గేటు ఎత్తి 360 క్యుసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. 

పది గేట్లు ఎత్తివేత
ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ఆల్మట్టి, నారాయణపూర్‌, జురాల ప్రాజెక్టులు పూర్తి స్థాయిలో నిండాయి. దీంతో శ్రీశైల జలశయానికి భారీ వరద ప్రవాహం కొనసాగుతోంది. జలాశయం పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 884.80 అడుగుల మేర నీరు చేరడంతో అధికారులు 10 గేట్లను ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. ఇన్‌ఫ్లో 4.87 లక్షల క్యూసెక్కులు ఉండగా..ఔట్‌ఫ్లో 3.48 లక్షల క్యూసెక్కులు ఉంది. 

నెలకొరిగిన భారీ వృక్షం
అదే విధంగా కృష్ణా జిల్లాలోని పామర్రులో రాత్రి వీచిన  ఈదురు గాలులు వీస్తుండటంతో భారీ  వృక్షం నేలకొరిగింది. ఈ చెట్టు అక్కడే పార్క్ చేసి ఉంచిన కారుపై పడటంతో కారు పూర్తిగా ధ్వంసమైంది. అలాగే ప్రధానరహదారి కావడంతో వాహనదారుల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారు. పెడన నియోజకవర్గంలో 24 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు నమోదైంది. అత్యధికంగా బంటుమిల్లి మండలంలో1 0 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అలాగే తిరువూరు 38.2 మి.మీ, విస్సన్నపేట 66.4 మి.మీ, ఏ-కొండూరు 10.2 మి.మీ, గంపలగూడెం 14.6 మి.మీటర్లు గా నమోదు

వివిధ జల్లాలోని పరిస్థితులు
శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో సముద్ర తీరంలో అలలు ఎగిసి పడుతున్నాయి. తూర్పుగోదావరిలోన కాకినడలో లోతట్టు ప్రాంతాలన్ని జలమయమయ్యాయి. సాంబమూర్తి నగర్‌, రామరావుపేటలో ఇళ్లలోకి వర్షపునీరు చేరడంతో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. డ్రైనేజీల నీరు పొంగిపొర్లడంతో రోడ్లన్నీ చెరువులను తలపిస్తున్నాయి. అదే విధంగా గుంటూరు పులిచింతల ప్రాజెక్టులోకి వరదనీరు భారీగా పోటెత్తుతోంది. దీంతో 9 గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. ఇన్‌ ఫ్లో 2.02 లక్షల క్యూసెక్కులు ఉండగా.. ఔట్‌ఫ్లో 2.5 క్యూసెక్కులు ఉంది. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top