దుకాణాల్లో చోరీ | In hospital hobbery occured | Sakshi
Sakshi News home page

దుకాణాల్లో చోరీ

Dec 12 2013 4:13 AM | Updated on Sep 17 2018 6:18 PM

కొంద రు గుర్తుతెలి యని వ్యక్తులు ఏకంగా తొమ్మిది దుకాణాల తా ళాలు పగుల గొ ట్టి రెండు షాపుల్లో దొంగతానికి పాల్పడ్డారు.

నారాయణపేట, న్యూస్‌లైన్: కొంద రు గుర్తుతెలి యని వ్యక్తులు ఏకంగా తొమ్మిది దుకాణాల తా ళాలు పగుల గొ ట్టి రెండు షాపుల్లో దొంగతానికి పాల్పడ్డారు. దీనికి పోలీ సుల వైఫల్యమే కారణమంటూ వ్యాపారులు ఆందోళనకు దిగారు. వివరాల్లోకి వెళితే... నారాయణపేట పట్టణంలోని ప్రధాన రహదారిపై చాలా దుకాణా లు ఉన్నాయి. ఎప్పటిలాగే నిర్వాహకులు మంగళవారం రాత్రి వాటికి తాళాలు వేసి ఇళ్లకు వెళ్లారు.
 
 బుధవారం తెల్లవారుజామున కొందరు గుర్తుతెలియని వ్యక్తులు స్థానిక యాద్గిర్‌రోడ్‌లోని వివిధ దుకాణ  షట్టర్లకున్న తాళాలు పగులగొట్టారు. బాబా వైన్స్‌లో రూ.రెండువేలతో పాటు బీరుకాటన్‌ను, ఎదురుగా ఉన్న భారత్ బ్యాటరీస్‌లో రూ.12 వేలు అపహరించారు. అలాగే సునీల్ ఐస్క్రీం, ఓం ఫ్లయ్‌వుడ్ సెంటర్, లక్ష్మి ట్రేడర్స్, కేజీఎన్ ఆటోమొబైల్స్, సుజాత జనరల్ స్టోర్, కర్లి బ్రదర్స్ సూపర్ మార్కెట్, ఫైనల్ వరల్డ్ దుకాణాల తాళాలు విరగ్గొట్టి నా షట్టర్లు తెరుచుకోకపోవడంతో వెనుదిరిగారు. ఉదయం బాధితులు వచ్చి గమనించి వెంటనే పోలీసులకు ఫిర్యా దు చేశారు. సంఘటన స్థలాన్ని సీఐ లింగయ్య పరిశీలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. కర్ణాటక రాష్ట్ర ముఠా పనే అయి ఉంటుందని వారు అనుమానం వ్యక్తం చేశారు.
 
 అలాగే క్లూస్‌టీం వ చ్చి ఫింగర్ ప్రింట్స్‌ను సేకరించారు. అనంతరం వ్యాపారులు కొద్దిసేపు   ఆందోళనకు దిగా రు. పోలీస్ పెట్రోలింగ్ లేకపోవ డం వల్లే తరచూ పట్టణంలో చోరీ లు జరుగుతున్నాయని వాపోయా రు. ప్రధాన కూడలిలో హైమాస్ట్ లైట్లు వెలగకపోవడంతో అంధకారం అలుముకుందన్నారు. సెం టర్‌చౌక్‌లోని సరాఫ్‌బజార్ నుంచి ర్యాలీ నిర్వహిస్తూ దుకాణాలను బంద్ చేయించారు. పలుచోట్ల సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, పోలీసుల గస్తీ ముమ్మరంగా చేయాలంటూ స్థానిక ఆర్డీఓ కార్యాలయ ఏఓ ప్రేమ్‌రాజ్‌కు వినతిపత్రం సమర్పించారు. కార్యక్రమంలో వ్యాపారులు హరినారాయణభట్ట డ్, సరాఫ్ నాగరాజు, దినేష్‌కుమార్‌లాహోటీ, శ్యాంసుందర్‌చారి, దిలిప్‌కుమార్‌వైకుంఠ్, ప్రకాశ్‌భట్ట డ్ తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement